రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన భారత జట్టు... 70 పరుగుల విజయ లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి చేధించింది. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 35 పరుగులు చేయగా, కెప్టెన్ అజింకా రహానే 27 పరుగులతో రాణించాడు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది టీమిండియా.

కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా, తొలి టెస్టులో చెత్త ప్రదర్శనను మరిపిస్తూ... రెండో టెస్టులో అద్భుతంగా రాణించింది టీమిండియా. ముఖ్యంగా కెప్టెన్‌గా అజింకా రహానే జట్టును నడిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ టెస్టుతో కలిపి మూడు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే.. మూడు మ్యాచుల్లోనూ టీమిండియాకు విజయాలను అందించాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ 5 వికెట్లతో రాణించగా, మరో మొదటి మ్యాచ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటుతో రాణించాడు.