Asianet News TeluguAsianet News Telugu

అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్ కెప్టెన్‌గా షెఫాలీ వర్మ... వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా...

2023 జనవరిలో ప్రారంభం కానున్న మొట్టమొదటి వుమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్‌గా షెఫాలీ వర్మకు ప్రమోషన్.. 

Team India Squad announced for U19 Women's World cup, Shafali Verma going to lead
Author
First Published Dec 5, 2022, 1:44 PM IST

పురుషుల అండర్ 19 వరల్డ్ కప్ మొదలై 34 ఏళ్లు పూర్తయ్యాయి. 1988లో మొదలైన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీమెంట్స్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది భారత జట్టు. అయితే ఇప్పటిదాకా అమ్మాయిల కోసం అండర్ 19 వరల్డ్ కప్ నిర్వహించలేకపోయింది ఐసీసీ. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఐసీసీ వుమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది.

2021లోనే వుమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ భావించినా, కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యంగా 2023లో ప్రారంభం కానుంది.  సౌతాఫ్రికాలో 2023, జనవరి 14 నుంచి జనవరి 29 వరకూ అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొనబోతున్నాయి. గ్రూప్ డీలో ఉన్న టీమిండియా, సౌతాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్‌లతో గ్రూప్ మ్యాచులు ఆడనుంది...

Team India Squad announced for U19 Women's World cup, Shafali Verma going to lead

గ్రూప్‌లో టాప్ 3 పొజిషన్లలో నిలిచిన ఆరు జట్లు, సూపర్ 6 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సూపర్ 6లో రెండు గ్రూపుల్లో టేబుల్ టాప్‌లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కి క్వాలిఫై అవుతాయి. సెమీస్‌లో చేరిన జట్లు, ఫైనల్ ఆడతాయి...

టీమిండియా యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ, మొట్టమొదటి అండర్19 వుమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు సారథిగా వ్యవహరించనుంది. 2004, జనవరి 28న జన్మించిన షెఫాలీ వర్మ వయసు 18 ఏళ్లు. వచ్చే నెలలో 19వ ఒడిలో అడుగుపెడుతున్న షెఫాలీ, 2019లోనే టీమిండియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసింది...

ఇప్పటిదాకా 2 టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20 మ్యాచులు ఆడిన షెఫాలీ వర్మ, మూడు ఫార్మాట్లలో కలిపి 11 హాఫ్ సెంచరీలతో 1800లకు పైగా పరుగులు చేసింది. వీరూలా దూకుడుగా బ్యాటింగ్ చేసే షెఫాలీతో పాటు టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్‌తో తెలంగాణకు చెందిన అమ్మాయి గొంగడి త్రిషా, అండర్ 19 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకుంది. 

అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్ కంటే ముందు సౌతాఫ్రికా అండర్ 19 టీమ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్‌కి కూడా జట్టును ప్రకటించింది బీసీసీఐ..

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి అండర్ 19 వుమెన్స్ భారత జట్టు ఇది: షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్, గొంగడి త్రిషా, సౌమ్య తివారి, సోనియా మెహ్దీయా, హర్లీ గలా, హర్షితా బసు, సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్,  అర్చనా దేవీ, పర్శవీ చోప్రా, తిటస్ సదూ, ఫలక్ నాజ్, సబ్నం మహ్మద్, శిఖా, నజ్లా, యశశ్రీ 

సౌతాఫ్రికాతో డిసెంబర్ 27న తొలి టీ20 ఆడే టీమిండియా, 29న రెండో టీ20, 31న మూడో టీ20 ఆడతాయి. ఆ తర్వాత 2023, జనవరి 2న నాలుగో టీ20, జనవరి 4న ఆఖరి టీ20 మ్యాచ్ ఆడతాయి. టీ20 సిరీస్ మ్యాచులన్నీ కూడా ప్రిటోరియాలోని టక్స్ ఓవల్‌లో జరుగుతాయి.


అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్‌కి భారత జట్టు ఇది: షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్, గొంగడి త్రిషా, సౌమ్య తివారి, సోనియా మెహ్దీయా, హర్లీ గలా, హర్షితా బసు, సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్,  అర్చనా దేవీ, పర్శవీ చోప్రా, తిటస్ సదూ, ఫలక్ నాజ్, సబ్నం మహ్మద్

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడే శిఖా, నజ్లా, యశశ్రీ, అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్‌కి స్టాండ్‌బై ప్లేయర్లుగా వ్యవహరిస్తారు.  

అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా జనవరి 14న సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడే భారత జట్టు, 16న యూఏఈతో తలబడుతుంది. ఆ తర్వాత జనవరి 18న స్కాట్లాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios