Asianet News TeluguAsianet News Telugu

రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ మనదే

టీమిండియా మరోసారి క్రికెట్ ప్రపంచంలో చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఒక అపూర్వమైన రికార్డును సృష్టించారు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉన్న ఫాస్టెస్టె సెంచరీ రికార్డును ఇప్పుడు భారత్ తిరగరాసింది.

Team India Smashes Record: Fastest 100 Runs in Test Cricket Against Bangladesh GVR
Author
First Published Sep 30, 2024, 2:42 PM IST | Last Updated Sep 30, 2024, 2:42 PM IST

టీమిండియా మరోసారి రికార్డు బద్దలు కొట్టింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. గతంలో ఫాస్టెస్టె సెంచరీపై ఉన్న రికార్డు మనవాళ్లు బద్దలు కొట్టారు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పట్లో 12.2 ఓవర్లలోనే 100 పరుగులు తీసింది. ఇప్పుడే అదే రికార్డును టీమిండియా బ్యాటర్లే తిరగరాశారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో 10.1 ఓవర్లలోనే 100 పరుగులు రాబట్టారు. దీంతో టెస్ట్‌ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన టీమ్‌గా ఇండియా చరిత్రలో చోటు సంపాదించుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios