Asianet News TeluguAsianet News Telugu

Rohit Sharma: అంతర్జాతీయ కెరీర్ లో హిట్‌మ్యాన్‌ కు 15 ఏండ్లు.. ఎమోషనల్ నోట్ షేర్ చేసిన టీమిండియా కెప్టెన్

Rohit Sharma 15 Years: భారత జట్టు సారథి రోహిత్ శర్మ కు నేటితో అంతర్జాతీయ కెరీర్ లో 15 ఏండ్లు నిండాయి. ఈ సందర్బంగా అతడు ట్విటర్ వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. 

Team India Skipper Rohit Sharma Completes 15 Years of International Cricket, Hitman Shares Heartful Note
Author
India, First Published Jun 23, 2022, 3:24 PM IST

టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ అంతర్జాతీ  క్రికెట్ కెరీర్ లో 15 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు.  2007 జూన్ 23న బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్‌.. నేటితో 15 ఏండ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ట్విటర్ వేదికగా తన అభిమానులతో ఎమోషనల్ నోట్ ను పంచుకున్నాడు. 

ట్విటర్ వేదికగా స్పందించిన హిట్‌మ్యాన్‌.. ‘ఈరోజుతో నేను అంతర్జాతీయ క్రికెట్ లో 15 ఏండ్లు పూర్తి చేసుకున్నా. ఇది చాలా గొప్ప ప్రయాణం. నా జీవితాంతం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన ప్రయాణమిది. ఈ  జర్నీలో నాతో పాటు కలిసి నడిచిన, నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా నా ఆటకు సహకరించి నన్ను ఇక్కడుండేలా తీర్చిదిద్దిన వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు. క్రికెట్ ప్రేమికులకు, ఫ్యాన్స్ కు, నా ఆటను ప్రేమించేవారికి, విమర్శించేవారికి పేరుపేరునా ధన్యవాదాలు. థ్యాంక్యూ..’ అని రాసుకొచ్చాడు. 

కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్ లో వచ్చిన హిట్‌మ్యాన్ ఫామ్ లేమితో జట్టులోకి వస్తూ పోతూ తంటాలుపడ్డాడు. కానీ సచిన్, సెహ్వాగ్ ల రిటైర్మెంట్ తర్వాత నిఖార్సైన ఓపెనర్ కోసం చూస్తున్న నాటి సారథి మహేంద్ర సింగ్ ధోనికి రోహిత్ శర్మ రూపంలో టాప్ క్లాస్ ఓపెనర్ దొరికాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా శిఖర్ ధావన్ తో రోహిత్ ను ఓపెనింగ్ పంపాడు ధోని. అప్పట్నుంచి హిట్‌మ్యాన్‌ వెనుదిరిగి చూసుకోలేదు. 

 

వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ.  తనపేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్న రోహిత్ ఇప్పటివరకు 228 వన్డేలలో 9,283 పరుగులు.. 44 టెస్టులలో 3,076 పరుగులు, 124 టీ20లలో 1,308 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ 41 సెంచరీలు చేశాడు. 

 

కెప్టెన్ అయ్యాక స్వదేశంలోనే  ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లాడు. ఇంగ్లాండ్ తో జులై 1 నుంచి జరుగబోయే ఐదో టెస్టులో  అతడు భారత జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.  ఈ మేరకు భారత జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios