టీమిండియా సెలక్షన్ ప్యానెల్‌పై భారత మాజీ క్రికెటర్ ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ మండిపడ్డాడు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకుండానే జట్టులోంచి తొలగించడంపై భజ్జీ ఆగ్రహంతో ఊగిపోయాడు.

దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కల్పించుకుని... భారత క్రికెట్ జట్టుకు ఒక బలమైన సెలక్షన్ కమీటీని ఎంపిక చేయాలంటూ సూచించాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన సంజూ శాంసన్‌ను బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు.

మూడు టీ20లలో జట్టు యాజమాన్యం అతడికి ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. చివరి మ్యాచ్‌లోనైనా ఛాన్స్ వస్తుందేమోనని అందరూ భావించారు. కానీ అలా జరగకపోవడంతో కనీసం వెస్టిండీస్‌తో టీ20లోనైనా అతనికి అవకాశం ఇస్తారని ఆశించారు.... కానీ అనూహ్యంగా సెలక్టర్లు సంజూని పక్కనబెట్టడంతో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు చేశారు.

ఇలాంటి చర్యల కారణంగా ఓ యువ ఆటగాడి ఆత్మ విశ్వాసం దెబ్బతింటే బాధ్యత ఎవరిదని హార్భజన్ ప్రశ్నించాడు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం సంజూ శాంసన్‌కు మద్ధతుగా నిలిచాడు.

ఒక్కసారైనా అవకాశం ఇవ్వకుండానే సంజూ శాంసన్‌ను తొలగించడం నిరాశ కలిగించిందని.. మూడు టీ20లకు అతను చక్కగా కూల్‌డ్రింక్స్ అందించాడని అయినప్పటికీ బయటకు పంపించేశారని మండిపడ్డారు.

వారు పరీక్షిస్తున్నది అతని బ్యాటింగ్‌నా లేక హృదయాన్నా అని థరూర్ వ్యాఖ్యానించాడు. సెలక్టర్ల తీరుపై చాలాకాలంగా ఇలాంటి విమర్శలు వస్తున్నాయని ఆయన విమర్శించాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో శాంసన్ మూడు మ్యాచ్‌ల్లో 112 పరుగులు చేశాడు.

థరూర్ వ్యాఖ్యలపై స్పందంచిన హార్భజన్.. తాను అనుకోవడం శాంసన్ హృదయాన్ని టెస్ట్ చేయాలనే అనుకుంటున్నారని చురకలంటించాడు. పటిష్టమైన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని అందుకు చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నానని హార్భజన్ వ్యాఖ్యానించాడు. 

భారత్ తన తొలి డే నైట్ పింక్ బాల్ టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. కేవలం మూడవరోజే ఆటను ముగించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్ల ధాటికి, భారత్ రెండో ఇన్నింగ్స్ కూడా ఆదానవసరం లేకుండా పోయింది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బాంగ్లాదేశ్ ను భారత్ 106 పరుగులకు అల్ అవుట్ చేసింది. ఆ తరువాత బాటింగ్ కు దిగిన భారత జట్టు కోహ్లీ సెంచరీ, రహానే అర్థ శతకంతో 347/9 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

ఆట ప్రారంభించిన బాంగ్లాదేశ్ ను భారత బౌలర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేసారు. బంగ్లా బ్యాట్స్ మెన్ లో మహ్మదుల్లా, ముషఫికర్ రహీమ్ లు భారత్ బౌలర్లపై ఒకింత ఎదురుదాడికి దిగినా అది వృధా ప్రయాసే అయ్యింది.