రోహిత్ శ‌ర్మ‌ను వెన‌క్కినెట్టిన జస్ప్రీత్ బుమ్రా.. !

Jasprit Bumrah: టీ20 ప్రపంచ కప్ 2024 లో టీమిండియా ఛాంపియన్ గా నిలవడంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో టీ20 ప్రపంచ కప్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి మరో అవార్డును దక్కించుకున్నాడు.

Team India's star bowler Jasprit Bumrah surpasses World Champion and Indian captain Rohit Sharma RMA

Jasprit Bumrah: టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్ గా నిల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్ శ‌ర్మ‌ను వెన‌క్కినెట్టిన బుమ్రా మరో ఐసీసీ అవార్డును ద‌క్కించుకున్నాడు. తాజాగా ఐసీసీ మంత్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే పురుషుల‌, మ‌హిళా జ‌ట్ల‌ నుంచి ఐసీసీ మంత్ ఆఫ్ ది ప్లేయ‌ర్లుగా టీమిండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధానలు అవార్డులు అందుకున్నారు. దీంతో ఒక నెల‌లో ఒకే సారి ప‌రుషులు, మ‌హిళ‌ల జ‌ట్ల నుంచి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్న మొదటి జట్టుగా భార‌త్ ఘ‌న‌త సాధించింది.

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో బుమ్రా ప్ర‌ద‌ర్శ‌న‌తో అవార్డును అందుకున్నాడు. అలాగే, మ‌హిళా క్రికెట్ లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయ‌డంతో స్మృతి మంధాన ఐసీసీ అవార్డును గెలుచుకున్నారు. జూన్ నెల‌కు గానూ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు ప్లేయ‌ర్లు  రేసులోకి వ‌చ్చారు. కానీ, జస్ప్రీత్ బుమ్రా తన కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌లను వెన‌క్కినెట్టి ఈ అవార్డును అందుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.

అలాగే, మ‌హిళా క్రికెట్ లో భార‌త స్టార్ స్మృతి మంధాన తన కెరీర్‌లో తొలిసారిగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకుంది. గత నెలలో బెంగళూరులో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో స్మృతి మంధాన రెండు సెంచరీలు చేసింది. ఈ సిరీస్ లో సెంచ‌రీ హ్యాట్రిక్‌కు చేరువైంది కానీ, బిగ్ షాట్ ఆడ‌బోయే 90 పరుగుల వద్ద ఔట్ అయింది. ఈ సిరీస్ మొత్తంలో మంధాన 114.33 సగటుతో 343 పరుగులను నమోదు చేసింది. 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకుంది.

IND VS ZIM : భార‌త్ గెలుపు.. శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గైక్వాడ్ హాఫ్ సెంచ‌రీ మిస్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios