న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో అతను తాళి కట్టనున్నాడు. ధనశ్రీ వర్మ అనే అమ్మాయిని అతను వివాహం చేసుకుంటున్నాడు. ఆమె వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్. 

తాను ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని చాహల్ స్వయంగా ప్రకటించాడు. గత కొంతకాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా పచ్చజెండా ఊపారు. పెళ్లి ముహూర్తం ఖరారు చేసిందుకు శనివారం వేడుక నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

కాగా, ధనశ్రీతో తాను ఉన్న ఫొటోను చాహల్ షేర్ చేస్తూ తన పెళ్లి విషయాన్ని ధ్రువీకరించాడు. "అవును, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, ప్రస్తుతం మా కుటుంబాలతో కలిసి రోకా కార్యక్రమంలో సందదడి చేస్తున్నాం" అని చాహల్ ట్వీట్ చేశాడు.

సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చాహల్, ధనశ్రీ ఫొటోలను చూసిన నెటిజన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. సహ క్రికెటర్లు కూడా అభినందనలు తెలుపుతున్నారు. సురేష్ రైనా ఇరువురికి అభినందనలు తెలిపారు.