టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఈసారి ఏకంగా రాజకీయ నాయకుడి వేషధారణలోో అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహేంద్ర సింగ్ ధోని... చాలా రోజులుగా ఈ పేరు వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ కప్ కు ముందు, ఆ తర్వాత అతడి రిటైర్మెంట్ పై చర్చ సాగింది. ఇటీవలే అతడు ఇండియన్ ఆర్మీకి సేవలందించేందుకు తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను కూడా పక్కనబెట్టాడు. దీంతో అతడి దేశభక్తిపై అభిమానుల్లో చర్చ జరిగింది. ఇటీవలే ధోనీ ఆర్మీ విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడిపై సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం జరుగుతోంది. అతడు రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు ఈ ప్రచార సారాంశం.
ఇన్నాళ్లు టీమిండియా జెర్సీలో కనిపించిన ధోని ఇటీవలే సైనిక దుస్తుల్లో కనిపించాడు. తాజాగా అతడు రాజకీయ నాయకుడి వేషధారణలో కనిపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అచ్చం రాజకీయ నాయకుడి మాదిరిగానే ధోని కుర్తా, పైజామా ధరించి నమస్కరిస్తూ కనిపించాడు. దీంతో ధోని రాజకీయ రంగప్రవేశం కోసం జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లలో ఇది భాగమై వుంటుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో తమ అభిమాన ఆటగాడికి సంబంధించిన ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.
అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఓ యాడ్ కోసమే ధోని అలా రాజకీయ నాయకుడి వేషధారణలో కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసినప్పటికి కొందరు కావాలనే ధోనికి రాజకీయాల్లో వస్తున్నట్లు అబద్దపు ప్రచారం చేశారని...ఇప్పట్లో అతడికి ఆ ఆలోచన లేదని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
అయితే గతంలో ధోని రిటైర్మెంట్ పై మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పాశ్వాన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎప్పుడు రిటైరవుతాడో తెలీదు కానీ ఆ తర్వాత మాత్రం ఏం చేస్తాడో చెప్పగలనని సంజయ్ పేర్కొన్నారు. క్రికెట్ నుండి తప్పుకున్నాక ధోని రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపాడు. కేంద్రంలో అధికారంలో వున్ని బిజెపి(భారతీయ జనతా పార్టీ)లో చేరడానికి అతడు సిద్దంగా వున్నాడని...నరేంద్ర మోదీ సారథ్యంలో అతడు మరో కొత్త ఇన్నింగ్స్ ఆడనున్నాడంటూ సంజయ్ సంచలన ప్రకటన చేశారు.
పార్టీలో చేరే అంశంపై చాలా కాలంగా బిజెపి అధినాయకత్వం,ధోనికి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే రిటైర్మెంట్ తర్వాతే ధోని చేరిక ఎప్పుడన్నదానిపై క్లారిటీ రానుందన్న సంజయ్ పాశ్వాన్ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ, క్రీడా వర్గాల్లో సంచలనంగా మారాయి.
సంబంధిత వార్తలు
రిటైర్మెంట్ తర్వాత ధోని బిజెపిలోకి: మాజీ కేంద్ర మంత్రి సంజయ్ పాశ్వాన్
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 23, 2019, 9:38 AM IST