కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎప్పుడు బిజీగా ఉండేవారికి కావాల్సినంత సమయం దొరకడంతో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు చేస్తున్న పనులను బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తోంది. తాజాగా భారత యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వంట చేస్తూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Also Read:ఐపీఎల్ పై మళ్ళీ చిగురించిన ఆశలు: బీసీసీఐ పక్కా ప్లాన్!

చెఫ్ అవతారమెత్తిన మయాంక్ ... బట్టర్ గార్లిక్ మషురూమ్‌తో పాటు బెల్ పెప్పర్స్ వంటకాలను నోరూరేలా వండివార్చాడు. మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను భారత క్రికెట్ నియంత్రణా మండలి గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

‘‘ మీట్ చెఫ్ మయాంక్ అగర్వాల్.. ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుచికరమైన వంటను తయారు చేశాడని క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్రికెటర్లు సోషల్ మీడియాలో తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు.

Also Read:ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు షాక్: నో ప్లే, నో మనీ!

కోవిడ్ 19 కారణంగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ రద్దవ్వగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఏప్రిల్ 15 వరకు బీసీసీఐ వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.