టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడు. దీంతో యూకేలో జరిగే ఇంగ్లాండ్ 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం వెళ్లలేకపోయాడు.

న్యూఢిల్లీ : టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ Ravichandran Ashwin కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ England 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం ఎక్కలేదు. ‘అశ్విన్ కరోనా వల్ల ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారని, కరోనా తగ్గిన తర్వాత మాత్రమే స్క్వాడ్ లో చేరతారని టీమిండియా వర్గాలు తెలిపాయి. భారత జట్టు ఈనెల 16వ తేదీన యూకేకు బయలుదేరి వెళ్ళింది. కరోనా సోకడంతో అశ్విన్ విమానంలో యూకేకు వెళ్లలేకపోయారు. జూలై 1వ తేదీన టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యే లోపు అశ్విన్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కరోనా వల్ల ఇతను లీసెస్టర్ షైర్ తో జరిగే ప్రాక్టీస్ గేమ్ ను కోల్పోవచ్చునని బిసిసిఐ పేర్కొంది. మిగిలిన జట్టు సభ్యులు ఇప్పటికే లీసెస్టర్ లో ఉన్నారు. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ల పర్యవేక్షణలో శిక్షణ ప్రారంభించారు. rahul dravid, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లు దక్షిణాఫ్రికాతో టి20 అసైన్ మెంట్ ముగించుకుని లండన్ కు చేరుకున్నారు. వారు మంగళవారం లీసెస్టర్ కు వెళ్లనున్నారు. జట్టు సభ్యులకు మూడు రోజుల విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఐర్లాండ్-బౌండ్ స్క్వాడ్ జూన్ 23 లేదా 24 న డబ్లిన్ కు బయలుదేరింది. గజ్జల్లో గాయం కారణంగా రాహుల్ ఈ సారి పర్యటనకు దూరం కానున్నారు. 

టీ20 వరల్డ్ కప్‌కి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ... ఆ లోపు జట్టును ప్రకటించాల్సిందే...