ఆన్‌లైన్‌లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ... కెప్టెన్ రోహిత్ శర్మ జెర్సీ ధర ఎంతంటే...

ఆన్‌లైన్‌లో విక్రయానికి టీమిండియా నయా జెర్సీ... రూ. 2 వేల నుంచి రూ.4 వేలకు పైగా ధర నిర్ణయించిన ఎంపీఎల్..

Team India new jersey online sale for fans in MPL Site, special editions for Virat Kohli, Rohit Sharma

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కొత్త జెర్సీతో బరిలో దిగబోతోంది టీమిండియా. భారత జట్టు పాత లైట్ బ్లూ కలర్ జెర్సీకి మొన్నటిదాకా వాడిన డార్క్ బ్లూ కలర్ షేడ్ టచ్ ఇచ్చి రూపొందించిన టీమిండియా నయా జెర్సీకి అభిమానుల నుంచి కాస్త పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. టీమిండియా జెర్సీ స్పాన్సర్ ఎంపీఎల్, ఈ టీ20 వరల్డ్ కప్ 2022 జెర్సీలో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది...

టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ప్రారంభ ధర దాదాపు 2 వేల రూపాయలు. ఫ్యాన్ ఎడిషన్‌ కింద రూపొందించిన జెర్సీకి రూ.1,999 వెల నిర్ణయించిన ఎంపీఎల్ స్పోర్ట్స్, ప్లేయర్ ఎడిషన్‌కి రూ. 3,999 ధర నిర్ణయించింది... అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మల పేరిట రెండు ప్రత్యేక ఎడిషన్లను కూడా విక్రయానికి ఉంచింది ఎంపీఎల్. విరాట్ కోహ్లీ 18 నెంబర్ జెర్సీ ధర రూ. 4,299, అలాగే రోహిత్ శర్మ 45 నెంబర్ జెర్సీ ధర కూడా ఇంతే.. 

అదే విధంగా అభిమానుల కోసం ప్రత్యేకంగా కస్టమైస్డ్ జెర్సీలను కూడా విక్రయిస్తోంది ఎంపీఎల్. అంటే ఆ జెర్సీపై ఏ నెంబర్ ఉండాలో, ఏ పేరు పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఈ కస్టమైజ్డ్ జెర్సీ ధర 4,499 రూపాయలుగా ఉంది...

పిల్లలు, మహిళల కోసం రూ.1,999 నుంచి రూ. 3,999 ధర వరకూ జెర్సీలు అందుబాటులో పెట్టింది మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) స్పోర్ట్స్. సింపుల్‌గా కనిపిస్తున్న ఈ జెర్సీలో చాలా నిగూఢ విషయాలను దాచి పెట్టింది ఎంపీఎల్...

జెర్సీలో కనిపిస్తున్న ట్రయాంగిల్స్ టీమిండియా అభిమానుల శక్తి, స్ఫూర్తి, సామర్థ్యాలను సూచికలు. అలాగే బ్లూ కలర్‌లో ఉన్న పూరేకులు... బీసీసీఐలో ఉన్న విలువలు, విధేయాలకు చిహ్నాలు. ఇక బీసీసీఐ లోగో కింద ఉన్న మూడు స్టార్లు... టీమిండియా గెలిచిన మూడు వరల్డ్ కప్స్‌కి సంకేతాలు... 

1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో మొట్టమొదటి వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. గత ఏడాది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సూపర్ 12 రౌండ్ నుంచి నిష్కమించిన భారత జట్టు, ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడుతోంది... 

టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జెర్సీని కొనాలనుకుంటే https://mplsports.in/collections/t20-jersey లింక్‌ని ప్రెస్ చేయండి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios