మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరంగా షాహీన్ షా ఆఫ్రిదీ... త్వరగా కోలుకోవాలని కోరుకున్న భారత జట్టు ప్లేయర్లు...
సింగిల్ హ్యాండెడ్ సిక్సర్లకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయాడు భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. 2020 ఐపీఎల్ తర్వాత భారత జట్టుకి మూడు ఫార్మాట్లలోనూ కీ ప్లేయర్‌గా మారిపోయిన రిషబ్ పంత్, భారీ అంచనాలతో ఆసియా కప్ 2022 టోర్నీలో బరిలో దిగబోతున్నాడు.
ఆసియా కప్ 2022 టోర్నీ కోసం దుబాయ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటోంది. ఆగస్టు 28న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌కి వెళ్లిన భారత జట్టును పాక్ యంగ్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ కలిసాడు. మోకాలి గాయంతో బాధపడుతూ ఆసియా కప్ 2022 టోర్నీకి దూరంగా ఉన్న షాహీన్ షా ఆఫ్రిదీ... కాలికి పట్టీతో బయటికి వచ్చాడు...
గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన షాహీన్ షా ఆఫ్రిదీని కలిసిన భారత క్రికెటర్లు యజ్వేంద్ర చాహాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్... త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొలుత భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, షాహీన్ ఆఫ్రిదీని కౌగిలించుకుని ఎలా ఉన్నావని పలకరించాడు.
ఆ తర్వాత అటుగా వచ్చిన విరాట్ కోహ్లీ... షాహీన్ ఆఫ్రిదీ గాయం గురించి ఆరా తీశాడు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నట్టు షాహీన్ ఆఫ్రిదీ కామెంట్ చేశాడు. విరాట్ తర్వాత షాహీన్‌ని కలిసిన రిషబ్ పంత్ కాసేపు అతనితో ముచ్ఛటించాడు...
‘నేను నీలా బ్యాటర్‌ని అయితే బాగుండు, ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టేవాడిని...’ అంటూ కామెంట్ చేశాడు షాహీన్ ఆఫ్రిదీ. దానికి రిషబ్ పంత్... ‘ఫాస్ట్ బౌలర్ అన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి సర్... తప్పదు...’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ..
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో షాహీన్ ఆఫ్రిదీ, భారత జట్టును ఘోరంగా దెబ్బ తీశారు. తొలి ఓవర్ మొదటి బంతికే రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, ఆ తర్వాతి ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం షాహీన్ షా ఆఫ్రిదీని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఓ స్ట్రైయిక్ సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, హాఫ్ సెంచరీ అనంతరం పెవిలియన్ చేరాడు...
ఆసియా కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన షాహీన్ ఆఫ్రిదీ, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి కూడా దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికి షాహీన్ ఆఫ్రిదీ కోలుకోవడానికి పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌తో టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నాడు. రోహిత్ శర్మ, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో సిక్సర్లు కొడుతుంటే ఆ స్వీట్ రివెంజ్‌ని తనివితీరా అనుభవించాలని కోరుకుంటున్నారు ఇండియా ఫ్యాన్స్...
