Asianet News TeluguAsianet News Telugu

ఇషాన్ కిషన్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అవుట్.. 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. ఇషాన్ కిషన్ అట్టర్ ఫ్లాప్... 4 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ డకౌట్.. 

Team India lost Virat Kohli, SuryaKumar Yadav, Ishan Kishan early, India vs Australia 1st ODI cra
Author
First Published Mar 17, 2023, 5:47 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో 189 పరగుల స్వల్ప లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభరాంభం దక్కలేదు. బౌలింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ నేటి మ్యాచ్‌కి దూరంగా ఉన్నాడు. దీంతో అతని ప్లేస్‌లో ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి ఓపెనింగ్ చేశారు...

మొదటి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా రెండో ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు మార్కస్ స్టోయినిస్. 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ డ్రాప్ చేశాడు... లేకపోతే రెండు బంతుల వ్యవధిలో రెండో వికెట్ పడి ఉండేది..

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తాను వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలుసుకున్న విరాట్ కోహ్లీ, కనీసం డీఆర్‌ఎస్ కూడా తీసుకోకుండా పెవిలియన్ చేరాడు... వైట్ బాల్ క్రికెట్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ కావడం ఇదే తొలిసారి.. 

ఆ తర్వాతి బంతికి సూర్యకుమార్ యాదవ్‌ని డకౌట్ చేశాడు మిచెల్ స్టార్క్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్..

5 ఓవర్లు ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్. అయితే డీఆర్‌ఎస్ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది. టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించడంతో శుబ్‌మన్ గిల్ నాటౌట్‌గా తేలాడు...

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 35.4 ఓవర్లలో 188 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 5 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ని సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయగా స్టీవ్ స్మిత్ 22, మార్కస్ లబుషేన్ 15, జోష్ ఇంగ్లీష్ 26 పరుగులు, కామెరూన్ గ్రీన్ 12, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 8 పరుగులు చేశారు. సీన్ అబ్బాట్, ఆడమ్ జంపా డకౌట్ కాగా స్టోయినిస్ 5 పరుగులు చేశాడు. 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో 129/2 స్కోరుతో ఉన్న ఆస్ట్రేలియా, 350+ స్కోరు చేసేలా కనిపించింది.

అయితే మిచెల్ మార్ష్ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 188 పరుగులకి ఆలౌట్ అయ్యింది... చివరి 8 వికెట్లను కేవలం 60 పరుగుల తేడాలో కోల్పోయింది ఆస్ట్రేలియా. భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ మూడేసి వికెట్లు తీయగా హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు. రవీంద్ర జడేజాకి రెండు వికెట్లు దక్కాయి.

Follow Us:
Download App:
  • android
  • ios