మూడు వికెట్లు తీసిన రాహుల్ చాహార్...ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకున్న శ్రీలంక జట్టు... 

82 పరుగుల స్వల్ప టార్గెట్‌ను శ్రీలంక జట్టు 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక జట్టు కోల్పోయిన మూడు వికెట్లూ రాహుల్ చాహార్ తీసినవే కావడం విశేషం. ఆవిష్క ఫెర్నాండో 12 పరుగులు చేయగా, మినోద్ భవుక 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

6 పరుగులు చేసిర సదీర సమరవిక్రమను రాహుల్ చాహార్ బౌల్డ్ చేసినా... సాధించినాల్సిన లక్ష్యం చిన్నది కావడంతో వానిందు హసరంగ, ధనంజయ డి సిల్వ ఏ మాత్రం కంగారు పడకుండా పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు.

బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీసిన హసరంగకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. శ్రీలంక, భారత్‌ల మధ్య ఇప్పటివరకూ 12 టీ20 సిరీస్‌లు జరగగా, ఇది లంకకు తొలి సిరీస్ విజయం... 

ద్వైపాక్షిక 20 సిరీస్ ఫైనల్‌‌లో భారత జట్టు ఓడిపోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు న్యూజిలాండ్‌పై రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా టీ20 ఫైనల్ ఓడిగా, ఇప్పుడు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో సిరీస్‌ను ఫైనల్ మ్యాచ్‌లో కోల్పోయింది.