పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన స్వల్ప ఆధిక్యంతో మురిసిపోయిన టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చాడు ప్యాట్ కమ్మిన్స్. ఓవర్ నైట్ స్కోరు 6/1 వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా... వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.

నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన బుమ్రా 2 పరుగులు చేసి అవుట్ కాగా, ఛతేశ్వర్ పూజారా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అజింకా రహానే కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. 15 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా.

ఓ బౌండరీ బాది ఖాతా ఓపెన్ చేసిన విరాట్ కోహ్లీ కూడా కమ్మిన్స్ బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది భారత జట్టు.