లంచ్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసిన టీమిండియా... ఏడో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అశ్విన్, కోహ్లీ...351 పరుగుల ఆధిక్యంలో టీమిండియా...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ కలిసి ఏడో వికెట్‌కి 50 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.
విరాట్ కోహ్లీ 86 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేయగా, రవిచంద్రన్ అశ్విన్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 34 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ 71 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఈ భాగస్వామ్యంలో కోహ్లీ 16 పరుగులే చేయడం విశేషం.
మూడో రోజు తొలి సెషన్‌లో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, 102 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 26, శుబ్‌మన్ గిల్ 14, పూజారా 7, పంత్ 8, రహానే 10, అక్షర్ పటేల్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
