Asianet News TeluguAsianet News Telugu

గబ్బాలో ఆస్ట్రేలియాకి షాక్... భారత్ చారిత్రక విజయం... సిరీస్ కైవసం...

గబ్బాలో చారిత్రక విజయం నమోదుచేసిన టీమిండియా...

89 పరుగులతో రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్...

2-1 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు..

Team India incredible win against Australia in Gabba, wons series with 2-1 CRA
Author
India, First Published Jan 19, 2021, 1:08 PM IST

గత 30 ఏళ్లలో ఆస్ట్రేలియాకి ఓటమి లేని స్టేడియం... ‘గబ్బా’లో ఆడాలంటే ఏ జట్టైనా భయపడేంత దుర్భేధమైన పిచ్. ‘బ్రిస్బేన్’లో విజయం మాదేనని పూర్తి ధీమాగా ఉన్న ఆస్ట్రేలియా... ఏ మాత్రం అనుభవం లేని టీమిండియా బౌలింగ్... అలాంటి క్లిష్ట పరిస్థఇతులను దాటుకుని రహానే నాయకత్వంలోని టీమిండియా చరిత్ర క్రియేట్ చేసింది. 

గబ్బాలో ఓటమి లేకుండా 32 టెస్టుల పాటు సాగిన ఆస్ట్రేలియా ఆధిపత్యానికి చెక్ పెడుతూ అద్వితీయ విజయం సాధించింది టీమిండియా. భారత యంగ్ వికెట్ కీపర్ పరుగులతో రాణించగా వాషింగ్టన్ సుందర్, ఛతేశ్వర్ పూజారా, శుబ్‌మన్ గిల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది భారత జట్టు. 

విరాట్ కోహ్లీ లేకుండా ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు లేకుండా రిజర్వు బెంచ్ ప్లేయర్లతో చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకుంది భారత జట్టు.

అజింకా రహానే కెప్టెన్సీలో భారత జట్టుకి ఇది నాలుగో విజయం... ఒక్క ఓటమి లేకుండా లేని భారత కెప్టెన్‌గా తన రికార్డు నిలుపుకున్నాడు రహానే. ఆడిలైడ్‌లో చారిత్రక ఓటమి తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా... గాయాలతో పోరాడిన టాప్ టీమ్ ఆస్ట్రేలియాపై సింహ గర్జన చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios