భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రిపైన వచ్చే ట్రోల్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండియా గెలిచినా, ఓడినా రవిశాస్త్రిపైన ట్రోల్స్ మాత్రం వస్తూనే ఉంటారు. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో రవిశాస్త్రిని మంచి మీమీ ప్రోడక్ట్ మరోకరు లేరు.

తాజాగా భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ‘కోవిద్-19 ఫస్ట్ డోస్ వేయించుకున్నాను. ఈ విపత్తు సమయంలో భారత్‌ను శక్తివంతం చేయడానికి కృషి చేస్తున్న అద్భుతమైన మెడికల్ ప్రొఫెషనల్స్‌కి, శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు...’ అంటూ కరోనా టీకా వేయించుకుంటున్న ఫోటోను పోస్టు చేశాడు రవిశాస్త్రి.

ఇందులో రవిశాస్త్రి కళ్లు చూస్తుంటే మత్తులో తూలుతున్నట్టు కనిపించడంతో ఈ ఫోటోపై కూడా తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఎప్పుడూ మత్తులో ఉండే మిమ్మల్ని కరోనా వైరస్ ఏం చేస్తుంది మాస్టారూ అంటూ కామెంట్లతో శాస్త్రిని ఆడుకుంటున్నారు నెటిజన్లు.