టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,  వైస్ కెప్టెన్ రవిశాస్త్రిల మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో కాని క్రీడావర్గాల్లో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. స్వయంగా కోహ్లీయే ఈ ప్రచారంపై స్పందిస్తూ రోహిత్ తో తనకెలాంటి విబేధాలు లేవని చెప్పినా ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడట్లేదు. దీంతో తాజాగా మరోసారి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి దీనిపై కాస్త ఘాటుగా స్పందించారు. 

''ఏ ఇద్దరి ఆలోచనలు,అభిప్రాయాలు ఒకే విధంగా వుండవు. అలాంటిది జట్టులో వుండే 15 మంది ఆటగాళ్ళ అభిప్రాయాలు ఒకేలా ఎలా వుంటాయి. కొన్నిసార్లు కెప్టెన్ అలోచనలు, అభిప్రాయాలు కొందరు ఆటగాళ్లకు నచ్చకపోవచ్చు. దీన్ని కేవలం అభిప్రాయబేధాలు అని అంటారే తప్ప విబేధాలు, గొడవలు అని అనరు. 

నేను దాదాపు ఐదేళ్లుగా భారత జట్టుతో కలిసి వివిధ హోదాల్లో ప్రయాణం కొనసాగిస్తున్నా. ఆటగాళ్లందరితో మంచి సంబంధాలున్నాయి. జట్టులో సమిష్టితత్వం ఎంత బలంగా  వుందో నాకు తెలుసు. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు ఎలా సహకరించుకుంటారో బాగా తెలుసు. 

ముఖ్యంగా జట్టు సభ్యుల మధ్య ఏదైనా వివాదాలు తలెత్తితే ముందుగా తెలిసేది నాకే. అలాంటిది కెప్టెన్, వైస్ కెప్టెన్ ల మధ్య విబేధాలుంటే తెలియదా.  వారి మధ్య నిజంగానే కోల్డ్ వార్ కొనసాగితే  రోహిత్ ప్రపంచ కప్ లో అంత కంపర్ట్ గా వరుస సెంచరీలు సాధించడం, కోహ్లీ అందుకు సహకరించడం జరిగేది కాదు.'' అని కోహ్లీ-రోహిత్ ల బేదాభిప్రాయాల  గురించి రవిశాస్త్రి వెల్లడించారు.