Asianet News TeluguAsianet News Telugu

తండ్రైన మాజీ క్రికెటర్ ఆర్ వినయ్ కుమార్... భార్య రిచా సింగ్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి...

ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఆర్ వినయ్ కుమార్ సతీమణి రిచా సింగ్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకున్న భారత మాజీ క్రికెటర్.. 

Team India former Cricketer Vinay Kumar wife Richa Singh blessed with baby girl
Author
India, First Published Jun 24, 2022, 2:01 PM IST

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్ వినయ్ కుమార్ తండ్రి అయ్యాడు. వినయ్ కుమార్ భార్య రిచా సింగ్ కుమార్, ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాతో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు ఆర్ వినయ్ కుమార్. ‘మా ఇంట్లోకి మా చిట్టి తల్లి రాకను తెలియచేయడానికి ఎంతో సంతోషంగా, థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నాం. ఆ దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి...’ అంటూ ట్వీట్ చేసి, భార్యాబిడ్డలతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు ఆర్ వినయ్ కుమార్...

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 500+ వికెట్లు తీసిన ఆర్ వినయ్ కుమార్, అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఫ్లాప్ క్రికెటర్‌గా మిగిలిపోయాడు. 2010లో ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన రంగనాథ్ వినయ్ కుమార్, 2013లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. . 

దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక తరుపున 15 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన ఆర్ వినయ్ కుమార్, ఆ తర్వాత పుదిచ్చేరి తరుపున మూడేళ్లు ఆడాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కొచ్చి టస్కర్స్ కేరళ, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్ల తరుపున ఆడిన ఆర్ వినయ్ కుమార్, 2021 ఫిబ్రవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. క

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్ వినయ్ కుమార్, భారత జట్టు తరుపున 31 వన్డేలు, ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 48 వికెట్లు తీసిన వినయ్ కుమార్, టెస్టుల్లో ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం అద్భుతంగా రాణించాడు వినయ్ కుమార్.

9 టీ20 మ్యాచులు ఆడిన ఆర్ వినయ్ కుమార్, 10 వికెట్లు పడగొట్టాడు. 139 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన వినయ్ కుమార్, 504 వికెట్లు పడగొట్టి, రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ‘దేవనగర ఎక్స్‌ప్రెస్‌’గా పిలువబడిన వినయ్ కుమార్, 2010 సీజన్‌లో 16 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచిన వినయ్ కుమార్, 37 ఏళ్ల వయసులో క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. 

వినయ్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ‘థ్యాంక్యూ వినయ్ కుమార్’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు కర్ణాటక క్రికెట్ అభిమానులు.. 2013, నవంబర్ 19న రిచా సింగ్‌ని పెళ్లాడాడు. 2009లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసిన ఈ ఇద్దరూ నాలుగేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులోని ఇంటెగ్రిటీ స్పోర్ట్స్ కంపెనీ స్థాపించిన రిచా సింగ్, రచయిత, ఫ్యాషన్ డిజైనర్ కూడా.. 

Follow Us:
Download App:
  • android
  • ios