Asianet News TeluguAsianet News Telugu

మిస్టర్ కూల్ ఎప్పుడూ స్పెషలే: ఆటోగ్రాఫ్ అడిగిన అభిమానికి ధోని సర్‌ప్రైజ్

ఏ సెలబ్రిటీని అయినా ఆటోగ్రాఫ్ అడిగితే బ్యాట్‌పైనో, పేపర్ పైనో, టీ షర్టులపైనో సంతకాలు చేస్తారు. కానీ అందరిలా చేస్తే అతను ధోని ఎందుకవుతాడు. ఇందుకు భిన్నంగా సదరు ఫ్యాన్ కొత్తగా కొన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై సంతకం చేసి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

team india fan get ms dhonis autograph on his new Royal Enfield Classic motorcycle
Author
Ranchi, First Published Nov 2, 2019, 5:10 PM IST

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనదేశంతో పాటు విదేశాల్లోనూ మహీకి అభిమాన గణం ఉంది. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని.. ఈ విరామంలో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

మళ్లీ ధోని ఎప్పుడు గ్రౌండ్‌లో అడుగుపెడతాడా అని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అభిమానిని ఆయన సర్‌ప్రైజ్ చేశాడు. తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ అభిమాని ధోనిని కోరాడు.

ఏ సెలబ్రిటీని అయినా ఆటోగ్రాఫ్ అడిగితే బ్యాట్‌పైనో, పేపర్ పైనో, టీ షర్టులపైనో సంతకాలు చేస్తారు. కానీ అందరిలా చేస్తే అతను ధోని ఎందుకవుతాడు. ఇందుకు భిన్నంగా సదరు ఫ్యాన్ కొత్తగా కొన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై సంతకం చేసి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో ఆ ఫ్యాన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.

ఓ వ్యక్తి ఈ సన్నివేశాన్ని వీడియో తీసి ట్వీట్టర్లో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ధోని రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. సఫారీలతో జరిగిన సిరీస్‌లోనూ.. త్వరలో జరగనున్న బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ మిస్టర్ కూల్ ఆడకపోవడంతో అతని భవిష్యత్‌ ఏంటా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 

Also Read:సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ధోనీ రిటైర్మెంట్... అభిమానుల్లో కంగారు

ప్రపంచకప్ అనంతరం ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని ధోనీ కొట్టిపారేశారు. తాను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటానో తనకే తెలీదని పేర్కొన్నాడు.

ప్రపంచకప్ తర్వాత ధోనీ ఇప్పటి వరకు మైదానంలోకి అడుగుపెట్టలేదు. రెండు నెలలు ఆర్మీకీ సేవలు అందించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లాడు. ఆ విధులు పూర్తి చేసుకొని కూడా ధోనీ తిరిగి వచ్చాడు. ధోనీ ఆర్మీకి వెళ్లాడనే కారణంతో దక్షిణాఫ్రికాతో మ్యాచులలో చోటు ఇవ్వలేదు. ఇప్పుడు ధోనీ తిరిగివచ్చాడు. త్వరలో బంగ్లాదశ్ తో సీరిస్ లు జరగనున్నాయి. వాటికి కూడా ధోనీని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. 

దీంతో మరోసారి ధోనీ రిటైర్మెంట్  టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోసల్ మీడియాలో ధోనీ రిటైర్మెంట్ గురించే చర్చ జరుగుతోంది.ధోని వీడ్కోలుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్‌లో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ సంచలనం సృష్టిస్తోంది.

మంగళవారం అనూహ్యంగా ట్విటర్‌లో ధోని రిటైర్మెంట్‌(#Dhoniretires) హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ధోని సాధించిన ఘనతలు, రికార్డులను గుర్తుచేస్తూ రిటైర్మెంట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు. దీనితో పాటు #ThankYouDhoni అనే మరో హ్యాష్‌ ట్యాగ్‌ కూడా తెగ ట్రెండ్‌ అవుతోంది. దీంతో ధోని అభిమానులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. 

Also Read:బూట్ల లేసులు కట్టుకోలేనివారు ధోనీపై విమర్శలా: రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు

అయితే జార్ఖండ్‌ డైనమెట్‌ వీడ్కోలు వార్తలను ఖండిస్తున్నారు. అంతేకాకుండా అతడికి మద్దతుగా నిలుస్తూ #NeverRetireDhoni అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు.  ఇక ధోని వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు ధోని ఆడాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా... ధోనీని పక్కన పెట్టిన సెలక్టర్లు... ఆయన స్థానంలో రిషబ్ పంత్ కి చోటు కల్పించారు. అయితే... దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పంత్ అనుకున్నంతగా రాణించలేదు. దీంతో నెటిజన్లు విమర్శించారు. ధోనీని తప్పించి... పంత్ ని తీసుకువచ్చారంటూ సెలక్టర్లపై మండిపడ్డారు. 

కాగా.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు ధోనీ భవిష్యత్తు గురించి తాను త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని  చెప్పిన గంగూలీ ఆ తర్వాత మాట మార్చేశాడు.  

అయితే రిటైర్మెంట్‌ విషయం ధోని వ్యక్తిగతమని, ఆ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరని గంగూలీ సింపుల్‌గా తేల్చిపారేశాడు. ఇక ధోనికి ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఆడించి ఘనంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఇవ్వాలని సెలక్టర్లకు క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios