వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. కాస్త కాళీ సమయం దొరకడంతో విరాట్ అండ్ టీమ్ అంటిగ్వాలోని జాలీ బీచ్‌లో గడిపారు. విండీస్ పర్యటనలో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో భారత్ తొలి టెస్టు ఆడనుంది.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు బీచ్‌లో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని కెప్టెన్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహానే, బుమ్రా, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లతో పాటు సహాయక బృందాన్ని కూడా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు.

ఇక వెస్టిండీస్ సిరీస్‌తోనే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను ఆరంభించనుంది. ఇప్పట్నుంచి టీమిండియా ఆడే ప్రతి టెస్టు కీలకం కానుంది. ఈ ఛాంపియన్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు తలపడతాయి.

మొత్తం 27 సిరీసుల్లో ఆయా జట్లు మొత్తం 71 టెస్టులు ఆడతాయి. 2021 జూన్ వరకు పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లాండ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Stunning day at the beach with the boys 🇮🇳👌😎

A post shared by Virat Kohli (@virat.kohli) on Aug 20, 2019 at 8:37pm PDT