Asianet News TeluguAsianet News Telugu

ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా... డ్రా దిశగా లార్డ్స్ టెస్టు, కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు...

లంబ్ చ్రేక్ తర్వాత 9 బంతులు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇండియా... భారత్‌కి 271 పరుగుల భారీ ఆధిక్యం... లార్డ్స్ మైదానంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ..

Team India declares Innings in Lords Test, Virat Kohli first Indian captain to do
Author
India, First Published Aug 16, 2021, 6:31 PM IST

రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంచ్ బ్రేక్ తర్వాత కూడా బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా... 9 బంతుల తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది. లంచ్ తర్వాత వచ్చిన 12 పరుగులతో కలిపి టీమిండియా ఆధిక్యం 271 పరుగులకి చేరింది. ఐదో రోజు ఆటలో ఇంకా 60 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

అంటే భారత జట్టు గెలవాలంటే ఈ 60 ఓవర్లలో 10 వికెట్లు తీయాల్సి ఉంటుంది... మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌ను గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ రెండూ కష్టసాధ్యమే కావడంతో మ్యాచ్ దాదాపు డ్రాగా ముగిసే అవకాశమే ఎక్కువగా ఉంది. మహ్మద్ షమీ 70 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేయగా జస్ప్రిత్ బుమ్రా 64 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేశారు. ఈ ఇద్దరికీ టెస్టుల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

ఈ ఇద్దరూ 9వ వికెట్‌కి 120 బంతుల్లో 89 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి, సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు... ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కి మూడు వికెట్లు దక్కగా, మొయిన్ ఆలీ, ఓల్లీ రాబిన్‌సన్ రెండేసి వికెట్లు తీశారు. సామ్ కుర్రాన్‌కి ఓ వికెట్ దక్కింది... లార్డ్స్ టెస్టులో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

Follow Us:
Download App:
  • android
  • ios