దాదాపు మూడు దశాబ్ధాల భారతీయుల నిరీక్షణకు తెరదించుతూ 2011లో టీమిండియా ప్రపంచకప్‌ను అందుకోవడంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ క్రికెట్ నుంచి రిటైర్‌ కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నియి.

మరికొద్దిసేపట్లో యువీ మీడియాతో మాట్లాడబోతున్నాడు. ముంబైలోని ఓ హోటల్‌లో అతను సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించేందుకే యువరాజ్ సింగ్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడని క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్, ఐర్లాండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. యువరాజ్ సింగ్ ఒకవేళ రిటైర్‌మెంట్ ప్రకటించినా ఎవరూ ఆశ్చర్యపడరు.

అతను భారత జట్టు తరపున 2012లో చివరి టెస్ట్..2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు. ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారత జట్టులో స్థానం కోల్పోయాడు.