న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ సందర్భంగా తనను కాదని రిషభ్ పంత్‌ను తుదిజట్టులోకి తీసుకోవడంపై సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యాఖ్యానించాడు. సహజంగానే ఏ ఆటగాడినైనా మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ఆర్డర్ ఎంపిక ఆధారంగా తుది జట్టు గురించి ఒక అవగాహన వస్తుందని, తన విషయంలో అదే జరిగిందని సాహా చెప్పాడు.

జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాలను బట్టి మెలగాల్సి వుంటుందని , గత సిరీస్ ఆడినందున తర్వాత సిరీస్‌లోనూ ఆడతామనే భావన మనసులో ఉండటం సహజమని అతని అభిప్రాయపడ్డాడు.

Also Read:మీ దృష్టి మార్చండి.. అతడి వయస్సు 22 ఏళ్లే: పంత్‌ను వెనకేసుకొచ్చిన రోహిత్

అయితే తాను సొంత ప్రయోజనాల కంటే జట్టు అవసరాలకే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశాడు. ఒకవేళ జట్టు రిషభ్ పంత్‌ను ఆడించాలనుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని, జట్టు గెలిస్తే చాలని తాను అనుకుంటానని వృద్ధిమాన్ సాహా వివరించాడు.

రంజీలో సౌరాష్ట్ర చేతిలో ఓటమి గురించి మాట్లాడుతూ.. కివీస్‌తో తాను టెస్టులు ఆడనప్పుడు ఎర్రబంతితో సాధన చేశానని, ఒకవేళ బెంగాల్ రంజీ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే అక్కడ ఆడదామనుకున్నానని తెలిపాడు. ఇక బెంగాల్‌తో కలిశాఖ జట్టులో మంచి వాతావరణం ఏర్పడిందన్నాడు.

Also Read:మళ్లీ అదే ఆట... పంత్ పై నెటిజన్ల ట్రోల్స్..

అయితే ఫైనల్‌లో మాత్రం తాము వికెట్ ఆశించినట్లు కనిపించలేదని సాహ అభిప్రాయాపడ్డాడు. ఇప్పుడు సాకులు చెప్పడం సరికాదని, ఏం జరిగినా తాము మంచి ప్రదర్శన చేయాల్సిందన్నాడు. ఎంతో కీలకమైన టాస్ ఓడిపోవడంతో పాటు మ్యాచ్ జరిగే సమయంలోనూ అన్ని విభాగాల్లోనూ కాస్త వెనుకబడ్డామని వృద్ధిమాన్ సాహా చెప్పాడు.