కరోనాతో మరణించిన తల్లి పుట్టినరోజునే వేదా కృష్ణమూర్తి వివాహం...  కర్ణాటకకు చెందిన క్రికెటర్ అర్జున్ హోసలాను పెళ్లాడిన వేదా... 

భారత మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ వేదా కృష్ణమూర్తి పెళ్లి చేసుకుంది. కర్ణాటకకు చెందిన క్రికెటర్ అర్జున్ హోసలా- వేదా కృష్ణమూర్తి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒక్కటయ్యారు. కరోనాతో మరణించిన తల్లి పుట్టినరోజునే వేదా కృష్ణమూర్తి వివాహం చేసుకోవడం విశేషం...

2021 జూలైలో భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో కరోనా వైరస్ కారణంగా రెండు విషాదాలు జరిగాయి. కరోనా బారిన పడి తొలుత ఆమె తల్లి ప్రాణాలు కోల్పోగా, నాలుగు వారాల వ్యవధిలో అక్క కూడా మరణించింది. పెళ్లి గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఈ ఇద్దరినీ గుర్తు చేసుకుంది వేదా కృష్ణమూర్తి...

‘మిస్టర్ అండ్ మిసెస్ లవ్. అమ్మ నీకోసమే ఇది. నీ పుట్టినరోజు ఎప్పటికీ నా స్పెషల్‌గా గుర్తుండిపోతుంది. లవ్ యూ అక్క... జస్ట్ మ్యారీడ్...’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది వేదా కృష్ణమూర్తి...

View post on Instagram

ఏప్రిల్ 2021లో వేదా కృష్ణమూర్తి కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. వేదా కృష్ణమూర్తి తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరూ కరోనా పాజిటివ్‌గా తేలారు. తొలుత వేదా కృష్ణమూర్తి కరోనాతో ప్రాణాలు విడచగా కొన్ని రోజులకు ఆమె అక్క వత్సల శివకుమార్... చికమగనూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది...

టీమిండియా తరుపున 48 వన్డేలు, 76 టీ20 మ్యాచులు ఆడిన వేదా కృష్ణమూర్తి, 2017 వన్డే వరల్డ్ కప్, 2020 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలు ఆడింది. మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో 51 పరుగులు చేసిన వేదా కృష్ణమూర్తి, ఓవరాల్‌గా 1685 పరుగులు చేసింది. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన వేదా కృష్ణమూర్తి, 2020 మార్చి తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయింది. 2021 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కూడా వేదా కృష్ణమూర్తికి చోటు దక్కలేదు..