టీమిండియాలో చోటు లేక...! హిందీ సిరీయల్లో నటిస్తున్న శిఖర్ ధావన్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా శిఖర్ ధావన్... కుండలి భాగ్య హిందీ సీరియల్‌లో నటిస్తున్న శిఖర్ ధావన్..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీపడిన టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్... ఇప్పుడు టీమ్‌లో చోటు కోల్పోయాడు. వాస్తవానికి ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ, రోహిత్ కంటే మెరుగైన రికార్డు ఉన్న ధావన్‌ని కావాలనే సైడ్ చేసింది బీసీసీఐ. ఐదు నెలల క్రితం టీమిండియా ఆడిన వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్, ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌లో చోటు కోల్పోయాడు...
టీమ్‌కి దూరమైన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్‌కి ఇంకా సమయం ఉండడంతో గ్యాప్‌లో ఓ హిందీ సీరియల్‌లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు గబ్బర్...
జీ ఛానెల్‌లో ప్రసారమయ్యే హిందీ సూపర్ హిట్ సీరియల్ ‘కుండలి భాగ్య’లో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు క్రికెటర్ శిఖర్ ధావన్. ఈ సీరియల్‌లో శిఖర్ ధావన్ ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పోలీస్ డ్రెస్సులో శిఖర్ ధావన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...
గబ్బర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఫోటోలు బయటికి వచ్చినా అతను ఐపీఎల్ 2023 ప్రోమోలో ఇలా కనిపించబోతున్నాడేమోనని అనుకున్నారంతా. అయితే సీరియల్‌లో నటించబోతున్నాడని తెలిసి గబ్బర్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు..
ఐదు నెలల క్రితం టీమిండియాకి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్, ఇప్పుడు సీరియల్ నటుడిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన నిలకడ చూపిస్తూ వన్డేల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. గిల్ పర్ఫామెన్స్ కారణంగా శిఖర్ ధావన్, వన్డేల్లో కూడా చోటు కోల్పోయాడు.. టెస్టు మ్యాచ్ ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే 187 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన శిఖర్ ధావన్, తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు...
2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన శిఖర్ ధావన్, ఆ తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయాడు. నిలకడగా రాణిస్తున్న శుబ్‌మన్ గిల్‌ని వన్డేల్లో ఫిక్స్ చేసిన టీమిండియా మేనేజ్‌మెంట్, శిఖర్ ధావన్‌ని సైడ్ చేసేసింది...
టీమిండియా తరుపున 34 టెస్టులు ఆడిన శిఖర్ ధావన్, 40.61 సగటుతో 2315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయినా కొన్ని మ్యాచుల్లో విఫలమయ్యాడని శిఖర్ ధావన్‌ని టెస్టు టీమ్ నుంచి తప్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్..
టీమిండియా తరుపున 167 వన్డేలు ఆడిన శిఖర్ ధావన్, 44.11 సగటుతో 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కీలక మ్యాచుల్లో అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడుతూ ‘మిస్టర్ ఐసీసీ టోర్నమెంట్స్’గా కీర్తి దక్కించుకున్నాడు శిఖర్ ధావన్...
అయితే 37 ఏళ్ల శిఖర్ ధావన్‌ని వయసు, స్ట్రైయిక్ రేటు కారణంగా చూపిస్తూ ఒక్కో ఫార్మాట్‌కి దూరం చేసిన బీసీసీఐ, 2022 తర్వాత ఏకంగా టీమ్‌లోనే లేకుండా చేసింది.. పెళ్లై పిల్లలున్న అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్, గత ఏడాది ఆరంభంలో ఆమెతో విడాకులు తీసుకున్నాడు..