బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశ ప్రజలను కలచివేసింది. అయితే కెరీర్‌లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను తాము సైతం ఫేస్ చేశామని పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు.

ఈ క్రమంలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఎన్నో  సార్లు అనుకున్నానని టీమిండియా పేసర్ మహమ్మ్ షమీ తెలిపాడు. పేలవమైన ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోవడం మొదలుకుని ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టిన సమయంలో తనకు చావే మార్గంలా అనిపించిందని షమీ వ్యాఖ్యానించాడు.

కానీ ఆ విపత్కర పరిస్ధితుల్లో కుటుంబసభ్యులు తనకు అండగా నిలబడటంతో దాని నుంచి బయటపడ్డానని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో తన సహచర క్రికెటర్లు కూడా ఎంతో ధైర్యం చెప్పడంతో ఆ పాడు ఆలోచనల నుంచి బయటపడగలిగానని షమీ పేర్కొన్నాడు.

డిప్రెషన్ అనేది ప్రతి మనిషికి పెద్ద సమస్యన్న అతను.. అందుకు తగిన కౌన్సిలింగ్ తీసుకోవడం లేదా ఆ బాధను సన్నిహితులతో పంచుకుంటే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని సూచించాడు.

Also Read:ఆ చెత్త మొహంతో డేటింగా.. సుశాంత్ పై కరీనా కామెంట్స్

మన మంచిని కోరుకునే వాళ్లతో మనసులోని భారాన్ని పంచుకోవడం వల్ల సమాధానం దొరుకుతుందని... అంతేకానీ చావు ఒక్కటే మార్గం కాదని షమీ చెప్పాడు. తన విషయంలో జట్టు నుంచి వచ్చిన సహకారం ఎప్పటికీ మరవలేనిదని.. తాను నిజంగా అదృష్టవంతుడ్నేనని టీమిండియా పేసర్ ఉద్వేగంగా తెలపాడు.

కాగా సుధీర్ఘకాలం పాటు జట్టుకు దూరమైన షమీ అంతే వేగంగా పుంజుకున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన సిరీస్‌ల్లో తన ఫామ్‌ను చాటుకుని నిలబడి, ప్రస్తుతం టీమిండియంలో ప్రధాన పేసర్‌గా సేవలందిస్తున్నాడు.

ఇదే సమయంలో అతని భార్య షమీపై లేనిపోని ఆరోపణలు చేయడం కూడా అతని మానసిక స్థైర్యాన్ని కుంగదీసింది. వాటిని మనో నిబ్బరంతో అధిగమించి ఆత్మహత్య ఆలోచనలు మంచివి కావని పలువురికి ఆదర్శంగా నిలిచాడు.