చూస్తుంటే టీం ఇండియా క్రికెటర్లకు పెళ్లిళ్ల సీజన్లో వచ్చేసినట్టు కనబడుతుంది. ఈ సంవత్సరం స్టార్టింగులోనే తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్ అయినట్టు ప్రకటిస్తూ ఆమెకు రింగు తొడిగాడు హార్దిక్ పాండ్య. ఇప్పుడు తాజాగా మరో టీం ఇండియా బ్యాట్స్ మెన్ ఒక ఇంటివాడయ్యాడు. 

గత సంవత్సరం కూడా ఇండియన్ పేస్ బౌలర్, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ఒక ఇంటివాడయ్యాడు. ఈ సంవత్సరం ఆరంభంలోనే టీం ఇండియా టెస్టు ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ కూడా తన మిత్రురాలిని పెళ్లాడాడు. 

Also read: బికినీలో హార్దిక్ పాండ్యా ప్రేయసి...హీట్ పెంచేస్తున్న ఫోటో నెట్టింట వైరల్

టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ కరుణ్ నాయర్ తన ప్రేయసి సనయా తంకరివాలాను పెళ్లి చేసుకున్నాడు. వేడుక అట్టహాసంగా కాకుండా చాలా నిరాడంబరంగా జరిగింది. 

ఉదయ్‌పూర్‌లో శుక్రవారం ఉదయం వీరి వివాహం జరిగింది. ఆడంబరాలకు పోకుండా జరిగిన ఈ వివాహానికి అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, చాలా క్లోజ్ గా ఉండే మిత్రులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.  

వీరి వివాహానికి హాజరైన రాజస్థాన్ రాయల్స్ పేసర్ వరుణ్ అరోన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫొటోలను పోస్టు చేశాడు. దానితో వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

To a lifetime of love and happiness !!💍💍 @sanayatankariwala @karun_6

A post shared by Varun Aaron (@varunaaron77) on Jan 17, 2020 at 1:28am PST

గతేడాది కరుణ్ నాయర్-సనయా నిశ్చితార్థం జరిగింది. కర్ణాటక బ్యాట్స్‌మన్ అయిన కరుణ్ నాయర్ 2016లో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ట్రిపుల్ సెంచరీ (303) చేశాడు. 

దీనితో అతడు ఎన్నో రికార్డులకెక్కాడు.  ట్రిపుల్ సాధించిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు కేవలం వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 

Also read: ‘కోహ్లీ ఆ భంగిమ ట్రై చేయలేదని అనుష్కకి కోపం’... రచయిత్రి అసభ్యకర కామెంట్

అంతేకాదు, టెస్టుల్లో ఇలా తన తొలి సెంచరీనే ‘ట్రిపుల్’గా మలిచిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు అందుకున్నాడు ఈ కర్ణాటక బ్యాట్స్ మెన్. ఇతడు ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుఫున ఆడుతున్నాడు.