Asianet News TeluguAsianet News Telugu

డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన ఇషాన్ కిషన్...‘కాలా చష్మా’ పాటకు బెల్లీ స్టెప్పులతో...

సీనియర్లు లేకుండా జింబాబ్వేలో వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... డ్రెస్సింగ్ రూమ్‌లో ‘కాలా చష్మా’ పాటకు స్టెప్పులు వేస్తూ సెలబ్రేషన్స్.. 

Team India Craze dance video goes viral after series win against Zimbabwe, Ishan Kishan, Shubman Gill
Author
India, First Published Aug 23, 2022, 11:29 AM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఎవ్వరూ లేకుండా జింబాబ్వే టూర్‌లో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. తొలి రెండు వన్డేల్లో పోటీ ఇవ్వకుండానే చేతులు ఎత్తేసిన జింబాబ్వే, మూడో వన్డేలో ఆఖరి ఓవర్ వరకూ పోరాడినా విజయానికి 13 పరుగుల దూరంలో ఆగిపోయింది...

ఒక్క శిఖర్ ధావన్ మినహా పెద్దగా సీనియర్లు లేకుండా దక్కించుకున్న ఈ విజయాన్ని డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు భారత క్రికెటర్లు. ‘కాలా చష్మా’ పాటకు భారత ప్లేయర్లు స్టెప్పులు వేస్తున్న వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇందులో ప్రధానంగా హైలైట్ అయ్యింది భారత యంగ్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్. భారత ప్లేయర్లకు కొరియోగ్రఫీ చేసిన ఇషాన్ కిషన్, పాట మొదలైన తర్వాత అలా వెనక నుంచి దూసుకొచ్చి బెల్లీ స్టెప్పులతో ఇరగదీశాడు. బెల్లీని పైకి కిందకి ఊపుతూ ఇషాన్ చేసిన స్టెప్పులు చూసి, క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు... 

బెల్లీ మూమెంట్స్ చేసిన తర్వాత అలా వెళ్లిపోయిన ఇషాన్ కిషన్, గబ్బర్ తన స్టైల్‌లో ఏదో మూమెంట్స్ వేయబోతుంటే... మళ్లీ వెనక్కి తిరిగొచ్చి, సీనియర్‌ని పక్కకు జరిపి మరీ కుప్పి గంతుల స్టెప్పులు నేర్పించాడు. ఇషాన్ కిషన్ నేర్పించిన స్టెప్పులను కాపీ చేసిన శుబ్‌మన్ గిల్, సెంచరీ ఇచ్చిన కిక్‌తో మరిత జోష్‌లో రెచ్చిపోయాడు... 

కామ్‌గా సైలెంట్‌గా కనిపించే ఈ ఇద్దరు కుర్రాళ్లు, ఇంత రచ్చ చేయడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. శిఖర్ ధావన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహార్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, రవి భిష్ణోయ్ వంటి ప్లేయర్లు అందరూ డ్యాన్స్ చేయగా... ఈ వీడియో ఓపెనింగ్‌లో కనిపించిన టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్... అలా కెమెరా ఓపెన్ చేసి సైడ్ అయిపోయాడు... 

2016 అండర్ 19 టీమిండియా కెప్టెన్. ఐపీఎల్ పర్పామెన్స్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్‌తో పోటీపడుతున్నాడు. ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్న ఇషాన్ కిషన్... రెండో వన్డేలో బ్యాటింగ్‌కి వచ్చినా ఆ అవకాశాన్ని చక్కగా వాడుకోలేకపోయాడు...

మూడో వన్డేలో మాత్రం హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఇషాన్ కిషన్. సెంచరీ హీరో శుబ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కి 140 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు ఇషాన్ కిషన్. 61 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 

83 బంతుల్లో వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్, జింబాబ్వే గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే వన్డేల్లో విదేశాల్లో సెంచరీ చేసిన మూడో చిన్న వయస్కుడు శుబ్‌మన్ గిల్...

ఇంతకుముందు యువరాజ్ సింగ్ 22 ఏళ్ల 41 రోజుల వయసులో ఆస్ట్రేలియాపై సెంచరీ చేస్తే, 22 ఏళ్ల 315 రోజుల వయసులో విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌లో సెంచరీ చేశాడు. శుబ్‌మన్ గిల్ ప్రస్తుత వయసు 23 ఏళ్ల 28 రోజులు..  

97 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 130 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు... జింబాబ్వేలో భారత బ్యాటర్‌కి ఇదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ చేసిన 127 పరుగుల రికార్డును అధిగమించాడు శుబ్‌మన్ గిల్. 

Follow Us:
Download App:
  • android
  • ios