సారాంశం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మైదానంలో దూకుడుకి పెట్టింది పేరు. ప్రత్యర్థులకు మాటకు మాట జవాబివ్వడంతో ముందుంటాడు. అటువంటి కోహ్లీ తనను తాను మార్చుకునేందుకు.. కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మైదానంలో దూకుడుకి పెట్టింది పేరు. ప్రత్యర్థులకు మాటకు మాట జవాబివ్వడంతో ముందుంటాడు. అటువంటి కోహ్లీ తనను తాను మార్చుకునేందుకు.. కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో పుస్తక ప్రియుడిగా మారిపోయాడు. వెస్టిండీస్‌లో మొదటి టెస్ట్ సందర్భంగా భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కోహ్లీ.. ఓ పుస్తకం చదువుతూ కనిపించాడు.
ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పుస్తకం పేరు ‘‘డిటాక్స్ యువర్ ఇగో: 7 ఈజీ స్టెప్స్ టు అచీవింగ్ ఫ్రీడం... హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్’’ (మీలోని అహాన్ని పారదోలండి... జీవితంలో స్వేచ్ఛ, సంతోషం, విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఏడు మార్గాలు’’. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లీ అంటేనే అహానికి కేరాఫ్ అడ్రస్ లాంటివాడని.. అతడు అలాంటి పుస్తకాన్ని చదవాల్సిందేనని అంటున్నారు. తనలోని అహాన్ని తగ్గించుకోవాలంటే ఈ పుస్తకం చదవడం ఒకే మార్గమని ఎవరో చెప్పి వుంటారని... అందుకే కోహ్లీ అంత సీరియస్‌గా చదువుతున్నాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
కోహ్లీ ఆ పుస్తకం చదవడం చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందని.. మరో నెటిజన్ కామెంట్ చేశాడు.