Mithali Raj: 24 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్న మిథాలీ రాజ్... వుమెన్స్ క్రికెట్‌లో అనితర సాధ్యమైన రికార్డులతో ‘లేడీ సచిన్’గా గుర్తింపు... 

భారత సీనియర్ బ్యాటర్, వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌...అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. 39 ఏళ్ల వయసులోనూ సుదీర్ఘ క్రికెట్ కొనసాగించిన భారత వుమెన్స్ క్రికెట్ లెజెండ్, ఎట్టకేలకు ఆట నుంచి తప్పుకుంటూ ప్రకటన చేసింది. వన్డేల్లో 71 హాఫ్ సెంచరీలు చేసి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మిథాలీరాజ్, 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగింది. సచిన్ టెండూల్కర్ కంటే సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌ కొనసాగిస్తూ, మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉంది మిథాలీ రాజ్...

Scroll to load tweet…

పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఉండే క్రేజ్, పాపులారిటీ, ఆదరణ చాలా తక్కువ. అందుకే మహిళా క్రికెటర్లకు చెల్లించే వేతనాల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ మెన్ క్రికెటర్లకు ఆరాధించే క్రికెట్ ఫ్యాన్స్‌లో చాలామంది మహిళా క్రికెటర్ల పేర్లు కూడా తెలీదు. అయితే ఓ మహిళా క్రికెటర్‌, దీన్ని మొత్తం మార్చేసింది. ఆమె వుమెన్స్ టీమ్ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీ రాజ్...

Scroll to load tweet…

మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ బయోపిక్ మూవీ ‘శభాష్ మీతూ’. తాప్సీ పన్ను ఈ మూవీలో మిథాలీ రాజ్ పాత్రలో కనిపించనుంది. నాలుగు వరల్డ్ కప్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథాలీ రాజ్, వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ భారత జట్టుకి సారథిగా వ్యవహరించింది. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆమెకి ఇదే ఆఖరి వరల్డ్ కప్...

వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ట్రోఫీలో మొదటి మూడు సీజన్లలో వెలాసిటీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించింది మిథాలీ రాజ్. ఈ సీజన్‌లో ఆమె పాల్గొనకపోవడంతో మిథాలీ రిటైర్మెంట్‌పై వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది మిథాలీ... వుమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని, వుమెన్స్ ఐపీఎల్ ఆడాలని కలలు కన్న మిథాలీ రాజ్, ఆ రెండు కోరికలు తీరకుండానే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించింది...