టీమిండియా పేసర్ మహ్మద్ షమీ హిందీ టీచర్ అవతారమెత్తాడు. తోటి క్రికెటర్‌కు హిందీని నేర్పిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడనున్న మహమ్మద్ షమీ, నికోలస్ పూరన్ వున్న ఒక ఫన్నీ వీడియోని పంజాబ్ యాజమాన్యం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

సదరు వీడియోలో షమీ.. పూరన్‌కు హిందీ నేర్పిస్తున్నాడు. ఇందులో మహమ్మద్ షమీ ‘‘ ఆప్ కహాన్ జా రహే హో ( మీరు ఎక్కడికి వెళుతున్నారు) అనే మాటను చెప్పగా.. దీనిని నికోలస్ తిరిగి చెబుతున్నాడు.

చాలా సేపటి తర్వాత కానీ సరిగ్గా ఉచ్చరించలేదు. హిందీ పాఠాలకు అడుగులు, నిక్కీ ప్రా!! అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు లైక్ కొడుతూ షేర్ చేస్తున్నారు.

కాగా నికోలస్ పూరన్‌ను 2018 ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేయగా.. ఐపీఎల్ 2019లో 7 మ్యాచ్‌లను ఆడి 28 సగటుతో 157 స్ట్రైక్ రేటుతో 168 పరుగుల చేశాడు. కాగా మహమ్మద్ షమీని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2018లో రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019లో షమీ 14 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.