రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ... కెమెరామెన్ తలకు తాకిన తిలక్ వర్మ కొట్టిన సిక్సర్, అయినా విధి నిర్వహణను కొనసాగించి... 

ఐపీఎల్‌లో క్రికెటర్ల తర్వాత ఎక్కువగా ట్రోలింగ్‌కి ఎదుర్కొనేది కెమెరామెన్లే. స్టేడియంలో ఉన్న అందమైన యువతులను ఏరి, మరీ వారిపై ఫోకస్ పెడుతూ... మ్యాచ్ చూసే ప్రేక్షకులకు నయానందాన్ని కలిగిస్తూ ఉంటారు కెమెరామెన్లు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆడిన మ్యాచ్‌లో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేలనే ఎక్కువగా చూపించాడని కెమెరామెన్‌ని తెగ ట్రోల్ చేశారు ఐపీఎల్ ఫ్యాన్స్...

అయితే స్టేడియంలో జరిగే ప్రతీ కదలికను కెమెరా కంటితో బంధించి, క్రికెట్ ప్రపంచానికి చూపించే కెమెరామెన్లు, కొన్నిసార్లు తన ప్రాణాలను సైతం రిస్క్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ సంఘటనే ఇందుకు ప్రత్యేక్ష నిదర్శనం...

ముంబై ఇండియన్స్ తరుపున బరిలో దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, మొదటి రెండు మ్యాచుల్లోనూ మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించి మాయమైన తిలక్ వర్మ, రెండో మ్యాచ్‌లో 61 పరుగులు చేసి ఐపీఎల్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...

33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన తిలక్ వర్మ కొట్టిన ఓ సిక్సర్, నేరుగా వెళ్లి బౌండరీ లైన్ దగ్గర మ్యాచ్‌ను కవర్ చేస్తున్న కెమెరామెన్ తలపై పడింది. బౌండరీ లైన్ దగ్గరే ఫీల్డింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు...

అయితే బంతి పడిన కొద్ది క్షణాలకే షాక్ నుంచి తేరుకున్న ఆ కెమెరామెన్, తిరిగి కెమెరా పట్టుకుని వీధి నిర్వహణలో బిజీ అయిపోవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ ఈ సంఘటనపై కెమెరామెన్‌కి హ్యాట్సాఫ్ చెబుతూ ట్వీట్ చేసింది...

Scroll to load tweet…

ముంబై ఇండియన్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించిన రాజస్థాన్ రాయల్స్, వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్ 68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు, ఐపీఎల్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు...

కెప్టెన్ సంజూ శాంసన్ 21 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 30 పరుగులు, సిమ్రాన్ హెట్మయర్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నారు... ముంబై ఇండియన్స్ 194 పరుగుల లక్ష్యఛేదనలో 170 పరుగులకి పరిమితమైంది...

కెప్టెన్ రోహిత్ శర్మ 10, అన్‌మోల్‌ప్రీత్ సింగ్ 5, టిమ్ డేవిడ్ 1, డానియల్ సామ్స్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచారు. రెండో మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మ 61 పరుగులు చేసి, 43 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసి ఇషాన్ కిషన్‌తో కలిసి మూడో వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అయితే ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్, నెట్ రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో పరుగులు చేయలేక చేతుల్లేతేసింది. కిరన్ పోలార్డ్ 22 పరుగులు చేసి ఆఖరి బంతి దాకా క్రీజులో నిలిచినా, ముంబైకి విజయాన్ని అందించలేకపోయాడు.