TATA IPL: స్నేహితులే శత్రువులవుతున్న వేళ.. రూ. 12 వేల కోట్ల కొత్త జట్ల టైటిల్ పోరు నేటి నుంచే..

TATA IPL2022 GT vs LSG: భారత క్రికెట్ జట్టులో వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్.  ఒక తల్లికి పుట్టకపోయినా ఇద్దరూ సోదరుల వలే కలిసుంటారు. వారి బ్రొమాన్స్ చూసి మిగతా సభ్యులు కూడా అసహ్యపడేవారు. అయితే ఈ ఇద్దరూ  నేడు వాంఖెడే స్టేడియం వేదికగా ఒకరిమీద ఒకరు... 

TATA IPL 2022: Debutants Gujarat Titans Face Their First Fight With Lucknow Super Giants, Follow Live Updates

ఐపీఎల్ సుమారు రూ. 12 వేల కోట్లకు పైగా వెచ్చించి గతేడాది రెండు ఫ్రాంచైజీలను దక్కించుకున్న జట్లు నేడు వాంఖడే వేదికగా తొలి పోరుకు సిద్ధమవుతున్నాయి.  ఐపీఎల్ లో అదిరిపోయే ఆరంభం కోసం చూస్తున్న ఆ రెండు జట్లే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్.  ఈ రెండు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నది  ప్రాణ స్నేహితులు కావడం గమనార్హం.  టీమిండియాకు చెందిన కెఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా. ఇప్పటిదాకా కలిసి మెలిసి ఉన్న ఈ ఇద్దరూ.. నేటి సాయంత్రం వాంఖెడే వేదికగా  హోరాహోరిగా తలపడబోతున్నారు.  సోమవారం  సాయంత్రం 7.30 గంటలకు ఈ రెండు జట్ల  మధ్య పోరుతో ఐపీఎల్ లో బోణీ చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి.  

గతేడాది ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల బిడ్  ల ప్రక్రయలో రూ. 7 వేల  కోట్ల (రూ. 7,090 కోట్లు)కు పైగా వెచ్చించిన లక్నో సూపర్ జెయింట్స్ కెఎల్ రాహుల్ ను సారథిగా నియమించుకుంది. గతేడాది పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్.. ఈ సీజన్ కు మందు పీబీకేఎస్ ను వీడి లక్నోతో చేరాడు. ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో లక్నో పటిష్టమైన జట్టును ఎంపిక చేసుకుంది. 

కెఎల్ రాహుల్ తో పాటు ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, క్వింటన్ డికాక్ లు  లక్నో బ్యాటింగ్ కు బలం. ఇక రిటెన్షన్ ప్రక్రియలో భారీ ధర వెచ్చించి తీసుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ప్రస్తుతం  ఈ మ్యాచుకు అందుబాటులో లేడు. అయితే దీపక్ హుడా, జేసన్ హోల్డర్ వంటి ఆటగాళ్ల రూపంలో ఆ జట్టుకు ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. ఇక బౌలింగ్ లో రూ. 10 కోట్లు పెట్టి దక్కించుకున్న అవేశ్ ఖాన్ ఏ మేరకు గుజరాత్ ను ఇబ్బంది పెడతాడో చూడాలి. అతడికి తోడుగా దుష్మంత చమీర, ఆండ్రూ టై కూడా బౌలింగ్ బాధ్యతల్ని మోయనున్నారు.  స్పిన్ బాధ్యతల్ని రవి బిష్ణోయ్ మోయనున్నాడు. 

 

ఇక గుజరాత్ టైటాన్స్ పై లుక్కేస్తే.. బిడ్ లో రూ. 5 వేల కోట్ల (రూ. 5,625 కోట్లు) కు పైగా వెచ్చించి అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆ జట్టు హార్థిక్ పాండ్యాను సారథిగా నియమించుకుంది. శుభమన్ గిల్, రహ్మనుల్లా గుర్బాజ్ లు ఓపెనింగ్ చేసే అవకాశముంది. డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, వృద్ధిమాన్ సాహా లరూపంలో మిడిలార్డర్ కూడా బలంగానే ఉంది. విజయ్ శంకర్, హార్థిక్ పాండ్యాలు ఆల్ రౌండర్ల పాత్ర పోషించనున్నారు. మహ్మద్ షమీ, డొమినిక్ డ్రేక్స్, లాకీ ఫెర్గూసన్ రూపంలో పేస్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండగా.. రూ. 15 కోట్లు పెట్టి దక్కించుకున్న మహ్మద్ షమీ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. 

జట్లు అంచనా : 

లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్),  ఎవిన్ లూయిస్, క్వింటన్ డికాక్, మనన్ వోహ్రా (లేదా) కృష్ణప్ప గౌతమ్, మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అంకిత్ రాజ్పుత్, దుష్మంత్ చమీర (లేదా) ఆండ్రూ టై 

గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్, అభినవ్ మనోహర్, హార్థిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ ల (లేదా) ప్రదీప్ సాంగ్వన్ 

ఎక్కడ, ఎప్పుడు..? 

ముంబైలోని వాంఖెడే వేదికగా శనివారం సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. 

ఎలా చూడొచ్చు...? 

స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్టార్ గోల్డ్, డిస్నీ హాట్ స్టార్ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios