టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మీడియాపై ఫైరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమ కుటుంబసభ్యుల గురించి గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌‌లో మీడియా ఎక్కువ చేసి చూపడంపై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read:టీ20 మ్యాచ్ ఆగినా.. అద్భుతమైన సీన్ పండింది.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ

అసలు మీడియాకి తమ ఫ్యామిలీ పట్ల ఎందుకు ఆసక్తి చూపుతుందని నిలదీశాడు. ఏమైనా చెప్పాలనుకుంటే తమ గురించి మాత్రమే రాయాలని, అంతే తప్ప ప్రతీ విషయంలో కుటుంబాన్ని లాగడం మంచి పద్ధతి కాదని మీడియాకు చురకలంటించారు.

ఇదే సమయంలో ప్రపంచకప్‌లో చోటు చేసుకున్న వివాదం గురించి రోహిత్ ప్రస్తావిస్తూ... మా ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయన్నారు. తమను సంతోషంగా ఉంచే క్రమంలో వారు తమతో ఉంటే తప్పేంటని హిట్ మ్యాన్ నిలదీశారు.

Also Read:టీ20: ఆపరేషన్ హెయిర్ డ్రయ్యర్ ఫెయిలంటూ నెటిజన్ల ట్రోల్స్

తమ కుటుంబసభ్యులు నిర్ణయించిన రోజుల కంటే ఎక్కువ రోజులు మాతో ఉన్నారని మీడియా రాసిందని.. తన మిత్రులు చెబితే నవ్వుకున్నామని అతను గుర్తుచేశాడు. తన గురించి ఏమైనా చెప్పాలనుకుంటే అది తనకే పరిమితం చేయాలని.. ఫలానా వాళ్లు తమ గురించి ఏదో అంటున్నారని రాస్తే దానిని తాము లెక్క చేయాల్సిన అవసరం లేదన్నారు. కాగా.. దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఫైర్ అయిన సంగతి తెలిసిందే.