గౌహతి వేధికగా... శ్రీలంక, భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కి వరుణుడు అడ్డుగా తగిలాడు. నూతన సంవత్సరంలో మొదలైన తొలి మ్యాచ్ ఇలా జరగడంతో... క్రికెట్ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. అయితే... మ్యాచ్ జరగకపోయినప్పటికీ... స్టేడియంలో అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి రోమాలు నిక్కపొడుచుకునే అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది.

పూర్తి వివరవాల్లోకి వెళితే.... ఆదివారం శ్రీలంక, భారత్ తొలి టీ20 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్... ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో... శ్రీలంక జట్టు బ్యాటింగ్ కి దిగింది. అయితే... అనుకోకుండా వర్షం ప్రారంభమైంది. అయితే ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపడానికి టీమిండియా అభిమానులంతా  ‘వందేమాతరం’ను ఆలపించారు. 

AlsoRead టీ20: ఆపరేషన్ హెయిర్ డ్రయ్యర్ ఫెయిలంటూ నెటిజన్ల ట్రోల్స్...

ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ బోర్డు(బీసీసీఐ)..  ‘గువాహటి.. యూ బ్యూటీ’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేయగా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వర్షం పడుతూ ఉంటే టీమిండియా అభిమాలంతా ఒక్కసారిగా లేచి నిలబడి..  వందేమాతరం ఆలపించి ఆటగాళ్లలో విశ్వాసాన్ని నింపిన  దృశ్యం మమ్మల్ని ఆకట్టుకుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.   

టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎన్నుకోవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. గత కొంతకాలంగా ఆ స్టేడియంలో సెకండ్ బ్యాటింగ్ చేసినా వాళ్లే.. గెలిచారని.. వాళ్లకే పిచ్ అనుకూలంగా ఉంటుందని కోహ్లీ పేర్కొన్నాడు. అందుకే తాను టాస్ గెలిచినా.. కూడా తాము ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు.