ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ జరిగే సమయానికి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరగాల్సింది. అయితే కరోనా వైరస్ కారణంగా మెగా టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది ఐసీసీ. ఎన్నో విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్‌ను నిర్వహించిన బీసీసీఐ, వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు నిర్వహించబోతోంది.

భారత్‌లో జరిగే ఈ టీ20 వరల్డ్‌కప్‌లో 16 జట్లు పాల్గొనబోతున్నాయి. టీ20 వరల్డ్‌కప్ 2021కి సంబంధించిన టోర్నీని దుబాయ్‌లో ఆవిష్కరించారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ బోర్డు కార్యదర్శి జై షా, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని పాల్గొన్నారు.

 

 

వచ్చే ఏడాది సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ కూడా పాల్గొంటోంది. 2007లో ప్రారంభమైన ఈ టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని మొదటి ఏడాది మాహీ గెలవగా... 2016లో జరిగిన టోర్నీలో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.