Asianet News TeluguAsianet News Telugu

సెమీస్‌లో ఓడిన పాకిస్తాన్, టాపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్న టీమిండియా ఫ్యాన్స్... అసలు కారణం ఇదే!

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన పాకిస్తాన్... పాక్ పరాజయాన్ని టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకున్న భారత అభిమానులు...

T20 Worldcup 2021: Team India fans celebrates Pakistan loss against Australia in 2nd Semi-finals of T20WC
Author
India, First Published Nov 12, 2021, 9:46 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021  మనం గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, శత్రువుగా భావించిన వాడు ఓడితే అంతకంటే ఎక్కవ ఆనందం, సంతోషం కచ్ఛితంగా ఉంటాయి. నైతిక విలువలు, క్రీడా స్ఫూర్తి వంటి ఉట్టి మాటలు కట్టి పెట్టి చూస్తే... ప్రత్యర్థి పరాజయం భలే కిక్ ఇస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ పరాజయాన్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారు టీమిండియా అభిమానులు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. అయితే మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడడంతో భారత జట్టు ప్లేఆఫ్స్‌కి చేరుకోలేకపోయింది. అదీకాకుండా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత జట్టు తొలిసారి విజయాన్ని అందుకున్న పాకిస్తాన్, విజయగర్వంతో విర్రవీగింది...

ఎదురుగా కనిపించే శత్రువు కంటే, మనలో ఉంటూ వెన్నుపోటు పొడిచే శత్రువు ప్రమాదకారి. దాయాది పాకిస్తాన్ చేతుల్లో భారత జట్టు పరాజయాన్ని కొందరు భారతీయులు సెలబ్రేట్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ పక్క టీమిండియా ఓడిపోయిందనే బాధ, మరో వైపు పాక్ విజయాన్ని మనవాళ్లే సెలట్రేట్ చేసుకోవడంతో భారత అభిమానులు కోపంతో రగిలిపోయారు...

Read Also: ఏంటీ ఫీల్డింగ్! ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారా... పాకిస్తాన్‌ని ట్రోల్ చేస్తున్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్...

సూపర్ 12 రౌండ్‌లో వరుసగా ఐదు విజయాలతో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది పాకిస్తాన్. మొదటి రెండు మ్యాచుల్లో  ఆ తర్వాత అదిరిపోయే అద్భుత విజయాలు అందుకుంది భారత జట్టు. అయితే ప్రత్యర్థి పాకిస్తాన్ టేబుల్ టాపర్‌గా సెమీస్‌కి దూసుకెళ్లడంతో టీమిండియా విజయాలు ఎక్కువగా కిక్ ఇవ్వలేదు...

ఆఫ్ఘాన్‌తో టీమిండియా పర్ఫామెన్స్‌ను తట్టుకోలేక ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేశారు పాక్ ఫ్యాన్స్. అంతేకాకుండా నమీబియాతో జరిగిన మ్యాచ్‌కి హాజరైన పాక్ క్రికెట్ ఫ్యాన్స్, ‘బై బై ఇండియా’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సంఘటనలతో ‘ఒక్క ఛాన్స్’ కోసం ఆశగా ఎదురుచూశారు టీమిండియా అభిమానులు. 

రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో 2009 తర్వాత టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని ఆశపడిన పాక్ కలలు నెరవేరలేదు. భారత జట్టు మూడు మ్యాచుల్లో గెలిచినప్పుడు ఇవ్వని సంతోషం, కిక్... పాకిస్తాన్ పరాజయం ఇచ్చింది...

దీంతో దేశవ్యాప్తంగా చాలామంది భారత అభిమానులు, పాక్ పరాజయాన్ని టపాసులు కాల్చుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. కాస్త రాక్షసత్వంగా కనిపిస్తున్న భారత అభిమానులు, పాక్ పరాజయాన్ని ఇంతలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణాలు లేకపోలేదు. 

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాపై మొట్టమొదటి గెలిచిన పాకిస్తాన్, భారత జట్టును తక్కువ చేస్తూ, చులకన చేస్తూ పిచ్చి కూతలు కూసింది. అదీకాకుండా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లు తీసిన పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ... స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాళ్లు ఎలా షాట్స్ ఆడుతూ అవుట్ అయ్యారో ఇమిటేట్ చేసి చూపించాడు...

Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...

అన్నింటికీ మించి భారత ప్రభుత్వం ఇచ్చే నిధులతో చదువుకుంటున్న కొందరు మెడిసిన్ విద్యార్థులు, భారత్‌పై పాక్ విజయాన్ని సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇవన్నీ సంఘటనలతో రగిలిపోయిన సగటు భారత క్రికెట్ ఫ్యాన్‌కి సెమీస్‌లో పాకిస్తాన్ ఓటమి, సంతృప్తిని మిగిల్చింది. అది కూడా భారత క్రికెటర్లు ఎలా అవుట్ అయ్యారంటూ షాహీన్ ఆఫ్రిదీ వెటకారంగా ఇమిటేట్ చేస్తూ చూపించాడో, అతని బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ అలాంటి షాట్లతోనే సిక్సర్లు బాదడం మరింత సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు మాథ్యూ వేడ్, టీమిండియాలో ఓ సూపర్ స్టార్‌గా మారిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios