Asianet News TeluguAsianet News Telugu

T20 worldcup 2021: హ్యాట్రిక్ కొట్టిన పాకిస్తాన్... రషీద్ ఖాన్ రికార్డు ఫీట్...

t20 worldcup 2021: 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం అందుకున్న పాకిస్తాన్... ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లతో పాక్‌కి విజయాన్ని అందించిన అసిఫ్ ఆలీ...

T20 worldcup 2021: Pakistan beats Afghanistan and registers hattrick wins in t20 worldcup
Author
India, First Published Oct 29, 2021, 11:12 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంది. భారత్, న్యూజిలాండ్‌లను ఓడించిన పాకిస్తాన్, ఆఫ్ఘాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ పూర్తిచేసుకుంది. ఆఫ్ఘాన్ జరిగిన మ్యాచ్‌లో 148 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాకిస్తాన్ జట్టు, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ త్వరగా కోల్పోయింది. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, ముజీబ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి నవీన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. అయితే బాబర్ ఆజమ్, ఫకార్ జమాన్ కలిసి రెండో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్‌ను ఆదుకున్నారు. 25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన ఫకార్ జమాన్, నబీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన మహ్మద్ హఫీజ్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

హఫీజ్ వికెట్‌తో టీ20ల్లో 100 వికెట్లు పూర్తిచేసుకున్నాడు రషీద్ ఖాన్. అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రషీద్ ఖాన్. లసిత్ మలింగ 76 మ్యాచుల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంటే రషీద్ ఖాన్ కేవలం 53 మ్యాచుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. వన్డేల్లోనూ అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా (44 మ్యాచుల్లో) రికార్డు క్రియేట్ చేశాడు రషీద్ ఖాన్.

టీ20ల్లో 117 వికెట్లు తీసిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్‌అల్ హసన్ టాప్‌లో ఉండగా, లసిత్ మలింగ 107 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ వారి తర్వాతి స్థానంలో ఉన్నాడు. 47 బంతుల్లో 4 ఫోర్లతో 51 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన షోయబ్ మాలిక్, నవీన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివరి 12 బంతుల్లో విజయానికి 24 పరుగులు కావాల్సి రావడంతో ఉత్కంఠ రేగింది. అయితే కరీం జనత్ వేసిన 19వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన అసిఫ్ ఆలీ, మరో ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేశాడు. 

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఛేదనలో వరుసగా రెండు విజయాలు అందుకున్న పాకిస్తాన్‌పై టాస్ గెలిచిన కూడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ. అయితే నబీ నిర్ణయం ఏ మాత్రం కరెక్ట్ కాదని, మొదటి ఓవర్‌లోనే వికెట్ పారేసుకుని తెలియచేశారు ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్...

5 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన హజ్రతుల్లా జిజాయి, ఇమాద్ వసీం బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్... 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మహ్మద్ షాబజ్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్.  

ఈ దశలో అస్గర్ ఆఫ్ఘాన్, రహ్మనుల్లా కలిసి మూడో వికెట్‌కి 20 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 7 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన అస్గర్ ఆఫ్ఘాన్, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన రహ్మనుల్లా కూడా హసన్ ఆలీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా బ్యాట్స్‌మెన్ దూకుడు మాత్రం తగ్గించలేదు.

17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన కరీం జనత్, ఇమాద్ వసీం బౌలింగ్‌లో ఫకార్ జమాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 64 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్... 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన జద్రాన్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 17 ఓవర్లు ముగిసేసరికి 104/6 పరుగులు మాత్రమే చేసింది ఆఫ్ఘాన్.

అయితే హసన్ ఆలీ వేసిన 18వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 21 పరుగులు రాబట్టాడు నయిబ్. ఆ తర్వాతి ఓవర్‌లో నబీ రెండు ఫోర్లు బాదగా, నయిబ్ ఓ ఫోర్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. ఈ దశలో 44 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గుల్బాదిన్ నయిబ్, మహ్మద్ నబీ ఆఫ్ఘాన్‌ను ఆదుకున్నారు. మహ్మద్ నబీ 32 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేయగా 25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు నయిబ్...

Follow Us:
Download App:
  • android
  • ios