Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: ఈ విజయం మీ మోములో ఆనందాన్ని తెచ్చిందని ఆశిస్తున్నా.. అఫ్ఘాన్ల కోసం రషీద్ ఖాన్ భావోద్వేగ పోస్టు

Rashid Khan:  తొలుత  బ్యాటింగ్ లో అదరగొట్టిన అఫ్గాన్ జట్టు.. తర్వాత బంతితోనూ మాయ చేసింది. ఫలితంగా భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత అఫ్గాన్ ఆటగాళ్లలో పలువురు భావోద్వేగానికి గురయ్యారు.

T20 Worldcup 2021: Afghanistan players rashid khan and mohammad nabhi emotional after their win match against scotland
Author
Hyderabad, First Published Oct 26, 2021, 2:56 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup2021) లో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్- స్కాట్లాండ్ (Afghanistan vs Scotland)మధ్య జరిగిన మ్యాచ్ లో అఫ్గాన్ (Afganistan) భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత  బ్యాటింగ్ లో అదరగొట్టిన ఆ జట్టు.. తర్వాత బంతితోనూ మాయ చేసింది. ఫలితంగా భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత అఫ్గాన్ ఆటగాళ్లలో పలువురు భావోద్వేగానికి గురయ్యారు. వారిలో  కెప్టెన్ మహ్మద్ నబీ (Mohammad Nabhi)తో పాటు స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) కూడా ఉన్నారు. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన రషీద్.. ‘గొప్ప ఆరంభం.. ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా దేశ ప్రజలకు అభినందనలు. ఈ విజయం మీ ముఖాలపై చిరునవ్వులు తెచ్చిందని ఆశిస్తున్నా. ఆ దేవుడి దయవల్ల మేం అత్యుత్తమ ప్రదర్శన చేశాం. దేశాన్ని, జాతిని తలెత్తుకునేలా చేశాం ఇలాగే ముందుకు సాగుతాం. మీ ప్రార్థనలు, మద్దతు మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి’ అని పోస్టు పెట్టాడు. 

 

ఇక అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ మ్యాచ్ కు ముందు తమ జాతీయ గీతం వినబడగానే  కన్నీటి పర్యంతమయ్యాడు. అఫ్గాన్ లో తాలిబన్ల పాలన,   క్రికెటర్లకు ప్రజల మద్దతు, టీ20 వరల్డ్ కప్ లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.  

 

ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్ లో తాలిబన్లు (Talibans) పాలనకు వచ్చారు. అప్పట్నుంచి దేశం అనిశ్చిత స్థితిలో ఉంది. తాలిబన్ల వల్ల ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చి పడుతుందో అని జనం భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ జట్టు.. టీ20 ప్రపంచకప్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ఘన విజయాన్ని నమోదు చేయడం ఆ జట్టుతో పాటు అఫ్గాన్లకు కాసింత ఊరటనిచ్చింది. 

 

తాజా విజయంపై అఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Asraf Ghani) కూడా స్పందించారు. ‘స్కాట్లాండ్ పై మన జాతీయ క్రికెట్ జట్టు హీరోలు సాధించిన విజయానికి కృతజ్ఞతలు. వాళ్లు ఇవాళ దు:ఖంలో ఉన్న దేశ  ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వెలిగించారు.

 

మీ విజయంతో దేశ ప్రజల హృదయాల్లో కొత్త ఆశలు నింపారు’ అని ట్వీట్ చేశారు. అఫ్గాన్ మాజీ దేశాధ్యక్షుడైన అమ్రుల్లా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios