Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: నిలబడి తడబడిన బంగ్లాదేశ్.. ఒమన్ ముందు ఊరించే టార్గెట్

Oman Vs Bangladesh: ఒమన్ తో జరగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటర్లు నిలబడి తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

T20 World cup2021: oman restricts Bangladesh to 153 in qualifying match
Author
Hyderabad, First Published Oct 19, 2021, 9:42 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup) క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ఒమన్ (Oman) లోని అల్ అమెరట్ క్రికెట్ స్టేడియంలో ఒమన్ తో జరగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ (Bangladesh) బ్యాటర్లు నిలబడి తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఒమన్ ముందు ఊరించే టార్గెట్ ను నిర్దేశించింది. 

గత మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన బంగ్లాదేశ్.. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఇన్నింగ్స్ ఆరంభించిన లిటన్ దాస్ (6).. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బిలాల్ ఖాన్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ గా  ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మహెది హసన్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. 

 

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షకిబుల్ హసన్ (shakib al hasan) (29 బంతుల్లో 42)  తో కలిసి బంగ్లా ఓపెనర్ మహ్మద్ నయీమ్ (naim) (50 బంతుల్లో 64) బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు. ఇద్దరూ కలిసి బాధ్యతయుతంగా ఆడి వంద పరుగులకు చేర్చారు. 

 

ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడిని ఫయాజ్ బట్ విడదీశాడు. అతడు వేసిన 13 వ ఓవర్ లో షకిబుల్ హసన్ రనౌట్ అయ్యాడు.  ఆ తర్వాత ఓవర్లో హాఫ్ సెంచరీ  కంప్లీట్ చేసుకున్న నయీమ్.. సిక్స్, ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించినా.. 16 వ ఓవర్ లో కరీముల్లా వేసిన బంతిని పుల్ షాట్ ఆడబోయి అయాన్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

హసన్ ఔటయ్యాక బంగ్లా వికెట్ల పతనం వేగంగా సాగింది. వచ్చినవారు వచ్చినట్టు పెవిలియన్ బాట పట్టారు. నురుల్ హసన్ (3), అఫిఫ్ (1), కెప్టెన్ మహ్మదుల్లా (17), ముష్ఫీకర్ (6), సైఫుద్దీన్ (0) పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. 

ఇక ఒమన్ బౌలర్లు తొలుత తడబడ్డా తర్వాత పట్టు బిగించారు. షకిబ్ ను ఔట్ చేసి  మ్యాచ్ ను ఒమన్ వైపునకు తిప్పారు. ముఖ్యంగా 13 వ ఓవర్ నుంచి బంగ్లా పులులను కట్టడి చేశారు. ఆ జట్టులో బిలాల్ ఖాన్ (Bilal Khan) 4 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఫయాజ్ బట్ (Fayaz Bhat) 4 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కరీముల్లాకు 2 వికెట్లు దక్కగా, కెప్టెన్ జీషన్ కు వికెట్ దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios