Oman Vs Bangladesh:ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. గ్రూప్-బి క్వాలిఫయర్ మ్యాచ్ లో ఆ జట్టు ఒమన్ ను ఓడించింది. దీంతో బంగ్లా సూపర్-12 ఆశలను సజీవంగా నిలుపుకుంది.

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup 2021)లో బంగ్లాదేశ్ (bangladesh) బోణీ కొట్టింది. గ్రూప్-బి క్వాలిఫయర్ మ్యాచ్ లో ఆ జట్టు ఒమన్ (Oman)ను ఓడించింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఒమన్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127పరుగులే చేసింది. దీంతో బంగ్లా 26 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-12 ఆశలను సజీవంగా నిలుపుకుంది.

154 పరుగుల లక్ష్య ఛేదనలో ఒమన్ కు ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో మెరిసిన ఓపెనర్ అకిబ్ (6) ఈ మ్యాచ్ లో తేలిపోయాడు. ముస్తాపిజుర్ (Mustafizur rahman) వేసిన రెండో ఓవర్ లో అతడు ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కానీ మరో ఓపెనర్, భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ (jatinder singh) (33 బంతుల్లో 40), కష్యప్ ప్రజాపతి (21) ధాటిగా ఆడారు. 

Scroll to load tweet…

ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్స్ లు బాదింది. కానీ మరోసారి ముస్తాఫిజుర్.. ఒమన్ ను దెబ్బ తీశాడు. 5వ ఓవర్లో కశ్యప్ (Kashyap prajapati) ను ఔట్ చేశాడు. అతడు ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ జీషన్ (Zeeshan Masood) (12) కొద్దిసేపే నిలిచాడు. ప్రజాపతి, జీషన్ ఔటైనా.. జతిందర్ క్రీజులో ఉండటంతో ఒమన్ విజయంపై ఆశలు నిలుపుకుంది. 

కానీ 12వ ఓవర్ వేసిన బంగ్లా స్పిన్నర్ షకిబ్ (Shakib al hasan).. జతిందర్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత పరుగులు రావడమే గగనంగా మారింది. జతిందర్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అయన్ ఖాన్ (9), హైదరాబాద్ కు చెందిన సందీప్ గౌడ్ (4), వికెట్ కీపర్ నసీమ్ ఖుషి (4), కరీముల్లా (5), ఫయాజ్ బట్ (0) అలా వచ్చి ఇలా వెళ్లారు. నదీమ్ (14) నాటౌట్ గా నిలిచాడు.

Scroll to load tweet…

ఇక కీలక మ్యాచ్ లో బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫుద్దిన్, మహెది హసన్ లు పొదుపుగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్ షకిబుల్ హసన్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసుకున్నాడు. ముస్తాఫిజుర్ 4 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. సైఫుద్దీన్, హసన్ తలో వికెట్ తీసుకున్నారు.

గత మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయిన బంగ్లాదేశ్.. తప్పక నెగ్గాల్సిన పోరులో బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. షకిబుల్ హసన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.