బెంగళూరు: ప్రపంచ కప్ పోటీల్లో సర్ ప్రైజ్ ప్యాకేజీ ఉంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శ్రీలంకపై రెండో వన్డేలో ఘన విజయం సాధించిన తర్వాత ఆయన ఆ మాట అన్నారు. ఆ సర్ ప్రైజ్ ప్యాకేజీ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. 

ప్రసిధ్ కృష్ణ ఫాస్ట్ బౌలింగ్ లో సర్ ప్యాకేజీ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టులో సర్ ప్రైజ్ ప్యాకేజీగా ఓ క్రిడాకారుడు ఉంటాడని చెబుతూ పేస్, బౌన్స్ లతో బౌలింగ్ చేయగల బౌలర్ అని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ లో ప్రసిధ్ కృష్ణ బాగా రాణించాడని చెప్పాడు. 

ప్రపంచ కప్ విషయానికి వస్తే బౌలింగులో కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కూడా కోహ్లీ అన్నాడు. కర్ణాటకకు చెందిన ప్రసిధ్ కృష్ణ విరాట్ కోహ్లీ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ కు సంబంధించి పలువురు బౌలర్లు అందుబాటులో ఉండడం ఇండియా ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది.

భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ స్థితిలో ప్రసిధ్ కృష్ణను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రసిధ్ కృష్ణ మంచి పేస్ తో షార్ప్ ఇన్ స్వింగర్స్ వేయగలడు. 23 ఏళ్ల ప్రసిధ్ బెంగళూరులో భారత జట్టుతో కలిసి కనిపిస్తున్నాడు. 

విజయ్ హజారే ట్రోఫీలో చూపిన ప్రతిభ కారణంగా ప్రసిధ్ ఇండియా ఏ టీమ్ లో చేరవచ్చు. ఇండియా ఏ టీమ్ న్యూజిలాండ్ కు శుక్రవారం బయలుదేరుతోంది. ఫిట్నెస్ ను నిరూపించుకోవడానికి అతని మరికొన్ని మ్యాచులు ఆడాల్సి ఉంటుందన భావిస్తున్నారు.