హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ పోటీలకు తాను ఎంపిక చేసిన జట్టును హైదరాబాద్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రకటించాడు. వీవీఎస్ లక్ష్మణ్ తాను ఎంపిక చేసిన జట్టులో ఎంఎస్ ధోనీకి చోటు కల్పించలేదు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ గా రిషబ్ పంత్ వైపే ఆయన మొగ్గు చూపారు. 

వచ్చే టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ధోనీ ఆడుతాడా లేదా అనే సందేహాలు చోటు చేసుకున్న సమయంలో వీవీయస్ లక్ష్మణ్ తాను ఎంపిక చేసిన జట్టును ప్రకటించాడు. దానికితోడు, ఓపెనర్ గా శిఖర్ ధావన్ కు కూడా లక్ష్మణ్ తన జట్టులో స్థానం కల్పించలేదు. 

రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్ కు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డాడు. దాంతో శిఖర్ ధావన్ ను పక్కన పెట్టాడు. 15 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఆయన ప్రకటించాడు.

లక్ష్మణ్ ఎంపిక చేసిన జట్టు ఇదే...

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, బుమ్రా, చాహల్, కుల్దీప్ యాదవ్, మనీష్ పాండే, శివం దూబే, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్.