T20 World Cup: త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ధరించనున్న కొత్త జెర్సీని  దుబాయ్ లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా పై ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

యూఏఈ వేదికగా ఈనెల 17 నుంచి మొదలుకాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 world cup) కోసం భారత జట్టు ధరించబోయే కొత్త జెర్సీని బుధవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత జట్టుకు కిట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ (MPL Sports) ఈ జెర్సీని రూపొందించింది. కాగా ఈ జెర్సీ ఇప్పుడు దుబాయ్ లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై మెరిసింది. 

బుధవారం విడుదలైన మెన్ ఇన్ బ్లూ కొత్త జెర్సీ (Team India New Jersey)ని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎంపీఎల్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ పేజీలో పంచుకుంది. బిలియన్ చీర్స్ జెర్సీగా 130 కోట్ల భారత అభిమానుల చీర్స్ (Billion Cheers Jersey) స్ఫూర్తితో దీనిని తయారు చేసినట్టు ఎంపీఎల్ స్పోర్ట్స్ బుధవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

Scroll to load tweet…

కాగా, బుధవారం సాయంత్రం బుర్జ్ ఖలీఫాపై మెరిసిన భారత కొత్త జెర్సీని చూసిన అభిమానులు ఆ వీడియోను తమ కెమెరాలలో బంధించారు. గతంలో జరిగిన ముఖ్యమైన మ్యాచ్ లతో భారత అభిమానులను చీర్ చేస్తున్న సౌండ్ వేవ్స్ ను కొత్త జెర్సీలో ఉంచడం విశేషం. 

Scroll to load tweet…

ఇది కూడా చదవండి: T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది.. రెట్రో బ్లూ డ్రెస్సులతో అదరగొడుతున్న భారత క్రికెటర్లు

ఈనెల 17 నుంచి నవంబర్ 14 దాకా జరుగబోయే పొట్టి ప్రపంచకప్ లో.. భారత్ తన తొలి పోరును అక్టోబర్ 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (India vs Pakistan)తో తలపడనున్నది. అంతకంటే ముందు ఈనెల 18న ఇంగ్లండ్ తో, 20న ఆసీస్ తో వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నది.