Asianet News TeluguAsianet News Telugu

T20 WorldCup: చెత్త వాగుడు వాగకు.. భారత జట్టుపై కామెంట్స్ చేసిన అబ్దుల్ రజాక్ పై మండిపడ్డ పాక్ మాజీ క్రికెటర్

Danesh Knaeria:పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ Abdul Razzaqకు ఆ దేశ మాజీ క్రికెటర్  డానిష్ కనేరియా గూబ గుయ్యిమనిపించే కౌంటర్ ఇచ్చాడు. చెత్త వాగుడు మానేస్తే మంచిదని అతడికి హితువు పలికాడు. 

T20 world cup pakistan former cricketer danish kaneria slams abdul razzaq on his comments about india
Author
Hyderabad, First Published Oct 7, 2021, 1:33 PM IST

త్వరలో జరుగబోయే T20 Worldcup లో టీమ్ ఇండియాను తక్కువగా అంచనా వేస్తూ కామెంట్స్ చేసిన పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ కు ఆ దేశ మాజీ క్రికెటర్  డానిష్ కనేరియా గూబ గుయ్యిమనిపించే కౌంటర్ ఇచ్చాడు. చెత్త వాగుడు మానేస్తే మంచిదని అతడికి హితువు పలికాడు. 

మూడు రోజుల క్రితం ఓ టీవీ ఇంటర్వ్యూలో Abdul Razzaq స్పందిస్తూ... ‘మాతో పోటీపడే సామర్థ్యం భారత్ కు లేదు. పాక్ లో భారత జట్టులో కంటే నాణ్యమైన ఆటగాళ్లున్నారు. అందుకే వాళ్లు మాతో ఆడటానికి  ముందుకు రావడం లేదు’ అని అన్నాడు. అంతేగాక త్వరలో భారత్ తో జరిగే మ్యాచ్ లో పాక్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని ఔట్ చేస్తే భారత్ ను ఓడించొచ్చని చెప్పుకొచ్చాడు. 

 

దీనిపై kaneria ధీటుగా స్పందించాడు. ‘Pakistan బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్లో నిలకడ ఉందా..? virat kohli, Rohit sharma లను ఔట్ చేస్తే భారత్ ను ఓడించొచ్చని రజాక్ చెబుతున్నాడు. నాన్సెన్స్.. అసలు ఇండియాను ఓడించగల ఆటగాళ్లు మన జట్టులో ఉన్నారా..? పాక్ జట్టు కూర్పులోనే సమస్యలున్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల క్రికెటర్లు జట్టులో ఎంత వెతికినా కానరారు. ఇంగ్లండ్ బీ టీమ్ మనను ఓడించింది. ఇవన్నీ తెలిసి కూడా ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదు’ అని రజాక్ కు చురకలంటించాడు. 

ఇది కూడా చదవండి: ICC T20 World Cup: భారత్ మాతో పోటీ పడలేదు.. అందుకే వాళ్లు మాతో ఆడరు : అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు

పాక్ కంటే భారతే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందన్న కనేరియా.. సూర్యకుమార్ యాదవ్, పాండ్యా, ఇషాన్ కిషన్, పంత్ వంటి మ్యాచ్ విన్నర్లు భారత్ కు ఉన్నారని అన్నాడు. ఒకరిద్దరు ఔటైనంతమాత్రానా టీమ్ ఇండియా ఢీల పడదని చెప్పాడు. ఇక Bumrahపై రజాక్ చేసిన వ్యాఖ్యలను కూడా కనేరియా ఖండించాడు. వసీం అక్రం, వకార్ యూనిస్ ల తర్వాత యార్కర్లను అంత అద్భుతంగా సంధించగల బౌలర్ బుమ్రా అని.. అతడికి సరిపోయే బౌలర్ పాక్ లో లేడని తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios