Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup : ఇంగ్లండ్ పై టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ.. ఫైన‌ల్ లోకి అడుగుపెట్టిన రోహిత్ సేన

IND vs ENG, T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ క‌ప్ సెమీ ఫైన‌ల్లో రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్ లు అద్భుత‌మైన బ్యాటింగ్ చేశారు. ఇక బౌలింగ్ లో భారత ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, బుమ్రాల సూప‌ర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఫైన‌ల్ కు చేరుకుంది భార‌త జ‌ట్టు. 
 

T20 World Cup 2024: Team India's super victory over England in the semi-finals... Rohit Sharma's army entered the final RMA
Author
First Published Jun 28, 2024, 1:34 AM IST

IND vs ENG, T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 రెండవ సెమీ-ఫైనల్‌లో భార‌త్ - ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి టీమిండియా విజ‌యాన్ని అందుకుంది. గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్ కు చేరుకుంది. మెగా టోర్నీ చివ‌రి మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. రోహిత్ సేన దక్షిణాఫ్రికాను ఓడించి క‌ప్ గెలుచుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 16.4 ఓవ‌ర్ల‌లో 103 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 


 

 

గ‌యానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జ‌రిగిన రెండో సెమీ ఫైన‌ల్  ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఇరు జట్ల ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. వర్షం కారణంగా టాస్ దాదాపు 1:30 గంటలు ఆలస్యమైంది. టీమిండియా సీనియ‌ర్ స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌-విరాట్ కోహ్లీల జోడీ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఈ టోర్నీలో మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ పని చేయలేదు. టాప్లీ వేసిన ఓవర్ నాలుగో బంతిని కూడా భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు.. కానీ క‌నెక్ష‌న్ కుద‌ర‌క‌పోవ‌డంతో క్లీన్ బౌల్డ్  అయ్యాడు. 4 ప‌రుగుల వ‌ద్ద పంత్ ఔట్ అయ్యాడు.

వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీ కొట్టిన రోహిత్ శ‌ర్మ 

అయితే, మ‌రో ఎండ్ రోహిత్ శ‌ర్మ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ కొన‌సాగించారు. భారత స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. సూర్య‌కుమార్ యాద‌వ్ తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 13వ ఓవర్ మూడో బంతికి సామ్ కుర్రాన్ వేసిన ఓవ‌ర్ లో  సిక్సర్ బాది హిట్‌మ్యాన్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. 14వ ఓవర్ నాలుగో బంతికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో హిట్‌మన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 39 బంతుల్లో 57 పరుగుల త‌న ఇన్నింగ్స్ రోహిత్ 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మొత్తంగా రోహిత్ కు 32వ హాఫ్ సెంచరీ. మ‌రో ఎండ్ లో ఉన్న  సూర్యకుమార్ యాదవ్ మంచి షాట్స్ ఆడుతూ ప‌రుగులు రాబ‌ట్టాడు. 36 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు.హార్దిక్ పాండ్యా 2 సిక్స‌ర్లు, ఒక ఫోర్ తో 23 ప‌రుగులు, ర‌వీంద్ర జ‌డేజా 17*, అక్ష‌ర్ ప‌టేల్ 10 ప‌రుగులు చేయ‌డంలో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది.

ఇంగ్లండ్ కు చెమ‌ట‌లు ప‌ట్టించారు.. 

172 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ ను భార‌త బౌల‌ర్లు బెంబేలెత్తించారు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌ను వ‌రుస‌గా పెవిలియ‌న్ పంపారు. జోస్ బ‌ట్ల‌ర్ 23 ప‌రుగులు, హ్యారీ బ్రూక్ 25 ప‌రుగులు, జోఫ్రా ఆర్చర్ 21 ప‌రుగులు మిన‌హా మిగ‌తా ప్లేయ‌ర్ల ఇలా వ‌చ్చి అలా పెవిలియ‌న్ కు వెళ్లారు. దీంతో ఇంగ్లాండ్ జ‌ట్టు 103 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్లు స‌మిష్టిగా రాణించారు. అక్ష‌ర్ ప‌టేల్ మొద‌టు పెట్టిన వికెట్ల వేట‌ను కుల్దీప్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రాలు ముగించారు. అక్ష‌ర్ ప‌టేల్ 3 వికెట్లు, కుల్దీప్ యాద‌వ్ 3 వికెట్లు తీసుకున్నారు. వీరికి తోడుగా జ‌స్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సూప‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించిన భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ కప్ 2024 ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది.

అద్భుతమైన మైలురాయిని అందుకుంటూ కోహ్లీ, ధోని, గంగూలీల‌ ఎలైట్ గ్రూపులో చేరిన‌ రోహిత్ శ‌ర్మ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios