టీ20 వరల్డ్ కప్ 2022: పోరాడి ఓడిన నమీబియా... సూపర్ 12 రౌండ్‌కి శ్రీలంక, నెదర్లాండ్స్...

యూఏఈతో మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో పోరాడి ఓడిన నమీబియా... డేవిడ్ వీస్ ఒంటరి పోరాటం వృథా..

T20 World cup 2022: UAE beats Namibia in Group A, Netherlands along with Sri Lanka moves to

మొదటి మ్యాచ్‌లో ఆసియా కప్ 2022 ఛాంపియన్ శ్రీలంకకు షాక్ ఇచ్చిన నమీబియా, అదే జోరును కొనసాగించలేకపోయింది. సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూఏఈతో పోరాడి ఓడిన నమీబియా... క్వాలిఫైయర్ రౌండ్ నుంచే నిష్కమించింది. అయితే యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన నమీబియా, ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా పోరాడి క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకుంది. 

యూఏఈతో మ్యాచ్‌లో నమీబియా 7 పరుగుల తేడాతో ఓడింది. దీంతో గ్రూప్ A నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాయి... గ్రూప్ 2కి నెదర్లాండ్స్, గ్రూప్ 1కి శ్రీలంక అర్హత సాధించాయి.

యూఏఈతో మ్యాచ్‌లో 149 పరుగుల లక్ష్యఛేదనలో నమీబియాకి శుభారంభం దక్కలేదు. స్టీఫెన్ బార్డ్ 4 పరుగులు చేసి అవుట్ కాగా జాన్ నికోల్ లోఫ్టీ-ఈటెన్ 1 పరుగుకే పెవిలియన్ చేరాడు.మైకెల్ వాన్ లింగెన్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు, కెప్టెన్ గెర్హర్డ్ ఎరామస్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుట్ కాగా జెజె స్మిత్ 3 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...

జేన్ గ్రీన్ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరగా జాన్ ఫ్రైలింక్ 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేశాడు. 69 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది నమీబియా. ఇక నమీబియా గెలవడం కష్టమని అనుకుంటున్న తరుణంలో రూబెన్ తంపెల్మెన్‌తో కలిసి డేవిడ్ వీజ్ అద్భుతంగా పోరాడాడు...

జునైద్ సిద్ధిక్ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టిన డేవిడ్ వీస్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నమీబియా విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 20 పరుగులు కావాల్సి వచ్చాయి.. జహూర్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో 6 పరుగులే వచ్చాయి. దీంతో విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది నమీబియా...

తొలి బంతికి 2 పరుగులు రాగా, రెండో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. మూడో బంతికి సింగిల్ రాగా నాలుగో బంతికి వీస్ అవుట్ అయ్యాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసిన డేవిడ్ వీస్ అవుటైన తర్వాత ఆఖరి 2 బంతుల్లో రెండు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. 


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 పరుగుల స్కోరు చేసింది. వికెట్ కీపర్ అరవింద్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేయగా మహ్మద్ వసీం 41 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... 39 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వసీం, రిజ్వాన్ కలిసి 58 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

అలిషాన్ షరఫు 4 పరుగులు చేయగా చుందగపోలీ రిజ్వాన్ 29 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు, బాసిల్ హమీద్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios