కరోనా పాజిటివ్‌ వచ్చినా లంకతో మ్యాచ్ ఆడుతున్న ఐర్లాండ్ క్రికెటర్ జార్జ్ డాక్రెల్... మారిన ఐసీసీ రూల్స్‌ను...

T20 World cup 2022: శ్రీలంకతో మ్యాచ్‌కి ముందు కరోనా పాజిటివ్‌గా తేలిన ఐర్లాండ్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్... లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో లంకతో మ్యాచ్‌లో బరిలో డాక్రెల్...

 

t20 world cup 2022: Ireland Cricketer George Dockrell tested corona positive and playing against Sri Lanka

కరోనా వైరస్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచమంతా అల్లాడిపోయింది. మాస్కులు, శానిటైజర్లు నిత్య జీవితంలో భాగమైపోగా క్వారంటైన్‌లు, ఐసోలేషన్ నిబంధనలతో జనాలు తెగ ఇబ్బంది పడ్డారు. కరోనా నుంచి ప్లేయర్లను దూరం ఉంచేందుకు బయో బబుల్‌ సిస్టమ్‌ని ప్రవేశపెట్టాయి క్రికెట్ బోర్డులు...

అయితే ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా, ప్లేయర్ల కదలికలపై పూర్తి నిఘా పెట్టినా క్రికెటర్లు కరోనా బారిన పడడం, కోవిద్ 19 కేసులతో క్రికెట్‌కి బ్రేక్ పడడం జరుగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు కరోనా ప్రొటోకాల్‌కి స్వస్తి పలికిన ఐసీసీ, కోవిద్19 పాజిటివ్‌గా తేలిన ప్లేయర్లు కూడా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడొచ్చని సూచించింది...

తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత కూడా క్రికెట్ మ్యాచ్ ఆడిన పురుష క్రికెటర్‌గా ఐర్లాండ్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్ రికార్డు క్రియేట్ చేశాడు. శ్రీలంకతో సూపర్ 12 రౌండ్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఐరిష్ క్రికెటర్ జార్జ్ డాక్రెల్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే మారిన ఐసీసీ రూల్స్‌ని అమలు చేస్తూ అతనికి తుది జట్టులో చోటు కల్పించింది ఐర్లాండ్ క్రికెట్ బోర్డు..

జార్జ్ డాక్రెల్‌లో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండడంతో మిగిలిన ప్లేయర్లకు ఈ వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ఐర్లాండ్ క్రికెట్ బోర్డు. 

సూపర్ 12 రౌండ్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయగా కెప్టెనన్ బాల్బీరిన్ 5 బంతుల్లో 1 పరుగు చేసి లహీరు కుమార బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

టక్కర్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేయగా హారీ టెక్టర్ 42 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు. కుర్టీస్ కాంపర్ 2 పరుగులు చేయగా కరోనా బారిన పడిన జార్జ్ డాక్రెల్ 16 బంతుల్లో 14 పరుగులు చేసి మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

డెలానీ 9, సిమీ సింగ్ 7, బారీ మెక్‌కార్తీ 2 పరుగులు చేయగా మార్క్ అడైర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మహీశ్ తీక్షణకు రెండు వికెట్లు దక్కాగా ఫెర్నాండో, లహిరు కుమార, కరుణరత్నే, ధనంజయ డి సిల్వలకు తలా ఓ వికెట్ దక్కింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios